
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవడం తో ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు. రీసెంట్ గా విడుదలైన కళావతి సాంగ్ ట్యూబ్ లో అనేక రికార్డ్స్ బ్రేక్ చేసింది.
కళావతి పాటను క్రేజీ సింగర్ సిద్ శ్రీరామ్ పాడగా, ప్రముఖ సాహిత్య రచయిత అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో అభిమానులు, సంగీత ప్రియులు రెండో సాంగ్ కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ సాంగ్ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. సెకండ్ సింగిల్ గా ఏ పాటను ఏ రోజున వదిలేది .. ఏ సమయంలో వదిలేది రేపు ప్రకటిస్తామని చెప్పారు. మరి ఆ పాట ఏంటో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
Get ready for the Paisa Vasool update ???#SarkaruVaariPaata Second Single announcement tomorrow ?#SVPOnMay12
Super? @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/VAbzQox2GD
— Mythri Movie Makers (@MythriOfficial) March 16, 2022