
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా..పరుశురాం డైరెక్షన్ చేస్తున్నాడు. కాగా ఈ మూవీ ప్రమోషన్ విషయంలో మొదటి నుండి కూడా మేకర్స్ నిదానంగా ఉండడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం సినిమా రిలీజ్ కు పట్టుమని 20 రోజులు కూడా లేదు. ఇలాంటి సమయంలో కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్ ను పెద్దగా చేయకపోవడం తో గత వారం రోజులుగా మేకర్స్ ఫై సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఎట్టకేలకు ప్రమోషన్ ను మొదలుపెట్టారు. చిత్ర ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ తో ప్రెస్ మీట్ మొదలుపెట్టారు. సోమవారం మీడియా తో ముచ్చటించిన ప్రకాష్..చిత్ర విశేషాలను పంచుకున్నారు.
సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన సినిమా తాలూకా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచగా..శనివారం సినిమాలోని మూడో సాంగ్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.