Homeటాప్ స్టోరీస్సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్

సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్

sarkaru vaari paata pre release business
sarkaru vaari paata pre release business

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మే 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ను భారీ గా జరిగింది. ఆ వివరాలు చూస్తే..

ఏపీలో 60 కోట్ల మేర బిజినెస్ జరిగితే.. నైజాంలో 40 కోట్లకుపైగా బిజినెస్ జరుగగా.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాల్సిన ఉంది. కర్ణాటకలో 15 కోట్లు, తమిళనాడులో 10 కోట్లు, కేరళలో 5 కోట్ల బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 33 కోట్లుగా నమోదైంది. దాంతో ఈ చిత్రం 38 కోట్ల టార్గెట్ ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో సెట్ చేసింది. మొత్తంగా సర్కారు వారీ పాట 175 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన సినిమా తాలూకా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచగా..ఇక ఈ మాస్ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All