Homeగాసిప్స్కాపీ ట్యూన్ తో మళ్లీ దొరికిపోయిన దేవిశ్రీ ప్రసాద్

కాపీ ట్యూన్ తో మళ్లీ దొరికిపోయిన దేవిశ్రీ ప్రసాద్

కాపీ ట్యూన్ తో మళ్లీ దొరికిపోయిన దేవిశ్రీ ప్రసాద్
కాపీ ట్యూన్ తో మళ్లీ దొరికిపోయిన దేవిశ్రీ ప్రసాద్

తకిట తకిట త టు… ఫోర్
తకధిమి తకధిమి సిక్స్… ఎయిట్
ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందో ఏమో అని భయమేస్తుంది. అభిమానులం అందరం కలిసి వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటామా.? కానీ వీళ్ళు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నిన్న సాయంత్రం సరిగ్గా ఐదు గంటల నాలుగు నిమిషాలకు మా మహేష్ బాబు నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు లో “మైండ్ బ్లాకు” అనే పాట విడుదలైంది. పాట విన్నాక అర్ధం అయ్యింది ఏంటంటే, అప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టిన పోకిరి సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగ్ “మైండ్ బ్లాక్” ని మళ్లీ మహేష్ బాబు సినిమాలో వాడుకున్నారు.

- Advertisement -

అంత పెద్ద హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ని మర్చిపోతారు గానీ, మావోడు రాసిన డైలాగ్ ని ఆల్రెడీ ఒకసారి శ్రీమంతుడు సినిమాలో “ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది…” అని వాడుకుని; మళ్లీ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలో మైండ్ బ్లాక్ అనే పాట కోసం వాడుకున్నారు. సరే వాడుకున్నది ఎవడో బయట వ్యక్తి కాదు లే మనోడే దేవి శ్రీ ప్రసాద్ కదా.. అని మెదలకుండా ఊరుకుంటే మొత్తం సాంగ్ అంతా… కాపీ కొట్టాడు భయ్యా..

అసలు పాట వింటుంటే ఒకటి కాదు మొత్తం మూడు ట్యూన్ లు గుర్తొస్తున్నాయి. మాములుగా కడుపుకి మందు తాగే వాడు ఎవడైనా ఒక పాటకి ఒక ట్యూన్ నే కాపీ కొడతాడు కానీ, మన దేవిశ్రీప్రసాద్ చాలా గొప్పవారు కదా అందుకని ఒక పాట కోసం ఏకంగా మూడు ట్యూన్ లను కాపీ కొట్టాడు. ఆల్రెడీ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన “నేను శైలజ..” సినిమా లో శైలజా… శైలజా… శైలజా అనే పాట ట్యూన్ ని మైండ్ బ్లాక్… మైండ్ బ్లాక్ కోసం వాడుకోగా, బేస్ రిథం ను జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నటించిన “ఆడోరకం ఈడోరకం” సినిమాలో ఉన్న “రెండు కోళ్ళు ఉన్నాయి – రెండు పెట్టలు ఉన్నాయి” అనే పాట ట్యూన్ నుంచి కాపీ కొట్టాడు. ఇక మధ్యమధ్యలో హీరోయిన కసిగా బాబు.. బాబు అనే డైలాగ్స్ ని హిందీ లో బాగా పాపులర్ అయిన సోను… అనే ట్యూన్ నుంచి కాపీ కొట్టాడు. ఫైనల్ గా పాట ఎలా ఉంది..? అని అడిగితే as it is ఉంది సార్ అని చెబుతున్నారు అభిమానులు.

ఎవరు ఎలా పోయినా, మధ్యలో మా దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం అన్యాయం అయిపోయాడు. మా అనిల్ అన్న ఇలా కాపీ ట్యూన్ లతో ఇబ్బంది పడటం ఇది మొదటిసారి కాదు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో మొదట వచ్చిన సినిమా “పటాస్” లో కూడా కాపీ ట్యూన్ సంఘం ప్రెసిడెంట్ అయిన మన సాయి కార్తీక్ రెండు మూడు పాటలకు కాపీ కొట్టిన ట్యూన్ లు ఇవ్వడమే కాకుండా, ఇంటర్వ్యూలలో సిగ్గు లేకుండా కాపీ ట్యూన్ లు ఇచ్చానని ఒప్పుకున్నాడు.

అసలు నాకు తెలియక అడుగుతాను భయ్యా..? ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు కదా..! కాపీ ట్యూన్ లు ఇవ్వమని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలే అడుగుతారా..? ఏదిఏమైనా, తెలుగు సినిమా మ్యూజిక్ అంటేనే ఎటకారం అయిపోయింది జనాలకి. కొత్తగా రిలీజ్ అయిన సినిమా లోనుంచి ఒక్కొక్క పాట వదులుతూ ఉంటే ఇది ఇంతక్రితం ఈ పాటని ఎందులో వాడారు.? అని చెప్పి రీసెర్చ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయారు. కాబట్టి మనోడే అని నమ్మి సినిమా ఇచ్చినందుకు మరొకసారి మహేష్ బాబును దేవిశ్రీప్రసాద్ పూర్తిగా డిజప్పాయింట్ చేసాడు అని అనుకోవచ్చు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All