Homeటాప్ స్టోరీస్జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సరిలేరు

జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సరిలేరు

జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సరిలేరుజెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సరిలేరు
జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సరిలేరు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ నింపాదిగా సినిమాలు చేస్తాడనే పేరుంది. అయితే స్పీడ్ గా పనిచేసే దర్శకులు ఉంటే మాత్రం మహేష్ చెలరేగిపోతాడు. అప్పట్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని మూడే నెలల్లో పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ప్రస్తుతం మహేష్ చేస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం అప్పుడే 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం చాలా బాగా వస్తోందని, మహేష్ ఫ్యాన్స్ కు పూనకాలే అని దర్శకుడు అనిల్ రావిపూడి రీసెంట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ తో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

- Advertisement -

షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి. దసరా సందర్భంగా ఈరోజు చిత్ర డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All