Homeటాప్ స్టోరీస్విజయ్ కి తండ్రిగా శరత్ కుమార్..

విజయ్ కి తండ్రిగా శరత్ కుమార్..

sarathkumar in vijay film
sarathkumar in vijay film

‘తలపతి’ విజయ్ కి తమిళనాట ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈయన నుండి సినిమా వస్తుందంటే పెద్ద పండగలా భావిస్తారు. అలాంటి విజయ్ ఫస్ట్ టైం తెలుగు లో సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తన 66 వ చిత్రంగా ఇది రాబోతుంది.

ఇటీవలే ఈసినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. చెన్నైలో గ్రాండ్ గా షూటింగ్ లాంచ్ చేశారు. రష్మికా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో విజయ్ కు తండ్రిగా సినియర్ హీరో శరత్ కుమార్ కనిపించబోతున్నారు. ఈ మధ్య తమిళ సినిమాకే ఎక్కువగా పరిమితమై.. పెద్దగా తెలుగులో సినిమాలు చేయని శరత్ కుమార్ మళ్లీ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All