Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్.. రాజమౌళి.. సంక్రాంతి.. ఇక చెప్పేదేముంది

ఆర్ ఆర్ ఆర్.. రాజమౌళి.. సంక్రాంతి.. ఇక చెప్పేదేముంది

Sankranthi a big advantage for RRR
Sankranthi a big advantage for RRR

సంక్రాంతి సినిమాలంటే టాలీవుడ్ లో ఎందుకంత హైప్ అన్నది ఈ ఏడాది మరోసారి వెల్లడైంది. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు రెండూ కూడా 100 కోట్ల పైన షేర్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. మరే సీజన్ లో ఇలా రెండు పెద్ద సినిమాలు విడుదలైనా వాటికి ఈ రేంజ్ లో షేర్ రాదు అన్నది నిర్విదాంశం. అందుకే సంక్రాంతికి సినిమాలు విడుదల చేయాలంటే టాలీవుడ్ దర్శక నిర్మాతలకు  అంత మోజు. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుండే సినిమాలను ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే వారందరి ఆశలపై నీళ్లు జల్లుతూ రాజమౌళి తన నెక్స్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ ను సంక్రాంతి కానుకగా జనవరి 8న దిన్చుబోతున్నట్లు ప్రకటించాడు.

అసలే రాజమౌళి సినిమా.. అందులోనూ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న సినిమా.. 400 కోట్ల భారీ బడ్జెట్.. ఇక చెప్పేదేముంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ చిత్రానిదే హవా అంతా. తెలుగు రాష్ట్రాల్లోని 1500 స్క్రీన్లు ఈ సినిమాతోనే నిండిపోనుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్నది అంచనా వేయడానికి కూడా ఊహకు అందట్లేదు. ఇప్పటిదాకా ఉన్న ప్రతి రికార్డ్ తుడిచిపెట్టుకుపోవడం మాత్రం పక్కా అని తెలుస్తోంది.

- Advertisement -

ఇలాంటి భారీ సినిమాకు ఎదురెళ్లడానికి కూడా ఎవరూ సాహసించరు అన్నది నిజం. ఇకపోతే ఈ సినిమాకు టికెట్ రేట్ల హైక్, అదనపు షో లు వంటివి ఉండనే ఉన్నాయి. మామూలుగానే ఆర్ ఆర్ ఆర్ బాహుబలి 2 రికార్డులకు ఎసరు పెడుతుందని అందరూ ఊహిస్తూనే వచ్చారు. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లు దీనికి సంక్రాంతి సీజన్ కూడా తోడైంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ సృష్టించే సునామీని మిగతా సినిమాలు సమీప భవిష్యత్తులో కూడా అందుకోలేవు. అందుకునే సాహసం కూడా చేయవు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All