Homeటాప్ స్టోరీస్200 కోట్ల క్లబ్ దిశగా సంజు

200 కోట్ల క్లబ్ దిశగా సంజు

sanju movie towards 200 crore clubసంజయ్ దత్ బయోపిక్ భారత్ లో ప్రభంజనం సృష్టిస్తోంది . ఆరు రోజుల్లో 186 కోట్ల కు పైగా వసూల్ చేసి 200 కోట్ల క్లబ్ దిశగా శరవేగంగా దూసుకుపోతోంది . రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో రణ్ బీర్ కపూర్ నటించాడు . రణ్ బీర్ కపూర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . రణ్ బీర్ కపూర్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది కానీ , సక్సెస్ రేటు మాత్రం అంతగా లేదు ప్లాప్ హీరో ముద్ర పడింది అయితే ఆ అపప్రద ని సంజు తీర్చి పడేసింది .

మనీషా కొయిరాలా , సోనమ్ కపూర్ , దియా మీర్జా , పరేష్ రావెల్ తదితరులు నటించిన సంజు 6 రోజుల్లోనే 186. 41 కోట్ల వసూళ్లని సాధించి
ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది . సంజయ్ దత్ జీవితం వివాదాస్పదం అన్న విషయం అందరికీ తెలిసిందే . సంజయ్ భాయ్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరించింది సంజు చిత్రం .

- Advertisement -

వారం రోజుల్లోనే 200 కోట్ల మైలురాయి ని అందుకునేలా ఉంది దాంతో అవలీలగా 300 కోట్ల క్లబ్ లో చేరొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఈ ఏడాది బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన చిత్రాల్లో సంజు అగ్రస్థానంలో నిలిచింది . భారీ ఓపెనింగ్స్ ని సాధించి 2018 టాప్ గ్రాసర్ గా నిలిచింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All