Homeటాప్ స్టోరీస్సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో మ‌రో ట్విస్ట్‌!

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో మ‌రో ట్విస్ట్‌!

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో మ‌రో ట్విస్ట్‌!
సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో మ‌రో ట్విస్ట్‌!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హ‌ఠాన్మ‌ర‌ణం బాలీవుడ్‌తో పాటు భార‌తీ‌య సినీ ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. సుశాంత్ ది ఆత్మ హ‌త్య కాద‌ని, అత‌న్ని ఎవ‌రో హ‌త్య చేశార‌ని, నెపోటిజ‌మ్ కార‌ణంగానే సుశాంత్ ఆత్మ హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని అభిమానులు, కొంత మంది సెల‌బ్రిటీలు అత‌ని మ‌ర‌ణంపై ఎన్నో అనుమానాలున్నాయ‌ని, సీబీఐ ఎంక్వైరీ చేయించాల‌ని డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే.

దీంతో ముంబై పోలీసులు సుశాంత్ మ‌ర‌ణంపై ఎక్వైరీ చేయ‌డం మొద‌లుపెట్టారు. సుశాంత్ ప్రేయ‌సి రియా చ‌క్ర‌వ‌ర్తిని ఆ త‌రువాత బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీని విచారించారు. ఇటీవ‌ల సుశాంత్ డిప్రెష‌న్‌కు గురైన వేళ అత‌నికి వైద్యం అందించిన న‌లుగురు డాక్ట‌ర్ల‌ని కూడా ప్ర‌శ్నంచి కీల‌క స‌మాచారం రాబ‌ట్టార‌ట‌. తాజాగా సంజ‌య్ లీలా భ‌న్సాలీ త‌రువాత య‌ష్‌ రాజ్ ఫిల్మ్స్ అధినేతి ఆదిత్య చోప్రాని కూడా విచారించిన పోలీసుల‌కు కొత్త విష‌యం తెలిసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందించిన రామ్ లీలా, భాజీరావ్ మ‌స్తానీ, ప‌ద్మావ‌త్ చిత్రాల్లో సుశాంత్ న‌టించాల్సింది. కానీ అత‌ని డేట్స్ కార‌ణంగా కుద‌ర‌లేద‌ని, ఆ కార‌ణంగానే అత‌న్ని త‌న చిత్రాల నుంచి త‌ప్పించిన‌ట్టు సంజ‌య్ లీలా భ‌న్సాలీ వాగ్నూలం ఇచ్చార‌ట‌. అయితే  సంజ‌య్ లీలా భ‌న్సాలీ స్టేట్‌మెంట్‌కు, ఆదిత్య‌చోప్రా స్టేట్‌మెంట్‌కు ఎక్క‌డా పొంత‌న లేక‌పోవ‌డంతో కొత్త అనుమానాలు మొద‌లైన‌ట్టు తెలుస్తోంది. దీంతో బాలీవుడ్‌లో సినీ మాఫియా డొంక క‌దులుతోంద‌ని చ‌ర్చ మొద‌లైంది. ఇదిలా వుంటే ఈ మంగ‌ళ‌వారం (21న‌) బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మ‌సంద్‌ని ముంబై పోలీస్‌లు ప్ర‌శ్నించి అత‌ని వాగ్నూలాన్ని రికార్డు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All