Homeటాప్ స్టోరీస్సందీప్ కిషన్ ఇప్పటికైనా హిట్ కొడతాడా ?

సందీప్ కిషన్ ఇప్పటికైనా హిట్ కొడతాడా ?

Ninu veedani needanu nenu
Ninu veedani needanu nenu

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలినాళ్ళలో మంచి పేరు తో పాటుగా సక్సెస్ కూడా చవిచూశాడు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది వరుసగా ప్లాప్ లు చవిచూస్తూ కెరీర్ పరంగా డోలాయమానంలో ఉన్నాడు . ఒకవైపు తెలుగు చిత్రాలు చేస్తూనే మరోవైపు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు . అసలు చెప్పాలంటే తెలుగు కంటే తమిళ చిత్రాల్లోనే ఎక్కువగా చేస్తున్నాడు .

తాజాగా సందీప్ కిషన్ హీరోగా ఓ హర్రర్ చిత్రంలో నటించాడు . నిను వీడని నీడను నేను అనే చిత్రం ఈనెల 12న విడుదల కానుంది . ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ , టీజర్ లు విడుదల కాగా అవి సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తున్నాయి . హర్రర్ నేపథ్యంలో సాగె ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న ధీమాతో ఉన్నాడు ఈ యంగ్ హీరో. నిజంగానే ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది అయితే ఆ స్థాయి కంటెంట్ సినిమాలో ఉంటే తప్పకుండా హిట్ అవుతుంది ? అయితే ఆ కంటెంట్ నిజంగానే ఉందా ? అన్నదే ఇప్పుడు ప్రశ్న .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All