Homeటాప్ స్టోరీస్సంయుక్త ..అబద్దం చెప్పిన అతికినట్లుండాలి

సంయుక్త ..అబద్దం చెప్పిన అతికినట్లుండాలి

Samyuktha Menon not happy
Samyuktha Menon not happy

పవన్ కళ్యాణ్ , రానా కలయికలో సాగర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందివ్వగా..నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ లు హీరోయిన్లు గా నటించారు. భారీ అంచనాల మధ్య గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని , కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు పవన్ , రానా లు ఇద్దరు కూడా తమ నట విశ్వరూపం చూపించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్లు గా నటించిన నిత్యా, సంయుక్త లు మాత్రం మేకర్స్ ఫై హార్ట్ అయ్యారట. ఇప్పటికే సినిమాలో అంత నీ ఇష్టం సాంగ్ ను సినిమా కు నిడివి ఎక్కువగా ఉందనే కారణంగా తీసేయడం తో నిత్యా చాల ఫీల్ అయ్యిందట. అందుకే ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుంది. ఇక మరో హీరోయిన్ సంయుక్త సైతం సినిమా పట్ల సంతృప్తి గా లేదట. 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న అంత ప్రాముఖ్యత సినిమాలో ఎక్కడా కనిపించలేదని ఆ కారణంగా సంయుక్త సైతం హర్ట్ అయ్యిందనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న అంత ప్రాముఖ్యత సినిమాలో ఎక్కడా కనిపించలేదని ఆమె ఫీల్ అవుతుందట. కాకపోతే డెబ్యూ మూవీ కావడంతో ఈ విషయం బయటకు చెప్పలేక తనలో తానే కుమిలిపోతోందని ప్రచారం సాగుతోంది. తాజాగా వీటిపై సంయుక్త మీనన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. “నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ `భీమ్లా నాయక్` లో నా పాత్ర విషయంలో కాదు. అభిమానులందరితో కలిసి రెండవ సారి సినిమా చూడాలనుకున్నా. కానీ టిక్కెట్లు దొరకలేదు. అందుకే మనస్తాపం చెందాను“ అని ట్వీట్ చేసింది. అయితే టిక్కెట్ దొరకలేదని హీరోయిన్ ఇంతగా ఫీలవ్వాలా? అని అంత మాట్లాడుకుంటున్నారు. ఒక్క టికెట్ కూడా దొరకలేదంటే నమ్మాలా..అబద్దం చెప్పిన అతికినట్లుండాలి సంయుక్త అంటూ నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All