Homeటాప్ స్టోరీస్సమ్మోహనం రివ్యూ

సమ్మోహనం రివ్యూ

Sammohanam Movie Reviewసమ్మోహనం రివ్యూ :
నటీనటులు : సుధీర్ బాబు , అదితిరావ్ హైదరి , నరేష్
సంగీతం : వివేక్ సాగర్
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 15 జూన్ 2018

విభిన్న కథా చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై జెంటిల్ మన్ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సుధీర్ బాబు హీరోగా నిర్మించిన చిత్రం ” సమ్మోహనం ” . అదితిరావ్ హైదరి , నరేష్ , పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రేక్షకులను సమ్మోహన పరిచేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

విజయ్ ( సుధీర్ బాబు ) బొమ్మలతో గీసిన చిన్నపిల్లల పుస్తకం అచ్చు వేయించడానికి ప్రయత్నాలు చేస్తాడు . విజయ్ నాన్న సర్వేశ్ (నరేష్ )కి సినిమాలంటే ప్రాణం దాంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని సినిమాల్లో నటించాలని ఉత్సాహ పడుతుంటాడు అదే సమయంలో సమీరా రాథోడ్ ( అదితిరావ్ హైదరి ) హీరోయిన్ గా నటించే కుమ్మేస్తా సినిమా షూటింగ్ కోసం తన ఇంటిని ఫ్రీగా ఇస్తాడు . షూటింగ్ లో భాగంగా విజయ్ ఇంటికి వస్తుంది సమీరా అక్కడ సరైన తెలుగు పలకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో విజయ్ తగిన సలహాలు , సూచనలు ఇస్తాడు దాంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది . అయితే విజయ్ సమీరా కు తన ప్రేమ ని వ్యక్తపరిచినప్పుడు తిరస్కరిస్తుంది . అసలు విజయ్ ని ఇష్టపడిన సమీరా అతడి ప్రేమని ఎందుకు నిరాకరించింది ? చివరకు విజయ్ – సమీరా లు ఒక్కటయ్యారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

సుధీర్ బాబు
అదితిరావ్ హైదరి
నరేష్

డ్రా బ్యాక్స్ :

స్లో నెరేషన్

నటీనటుల ప్రతిభ :

సుధీర్ బాబు నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది , తన నటన ని మరింత మెరుగుపరుచుకున్నాడు ఈ చిత్రంతో . ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు . ఈ చిత్రంతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు సుధీర్ బాబు . అదితిరావ్ హైదరి కూడా తన పాత్రలో ఒదిగిపోయింది . నటనలోనే కాకుండా గ్లామర్ ని కూడా ఒలకబోసింది అదితి . ఇక ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ సీనియర్ నరేష్ పాత్ర . ఈ సినిమాలో అతిపెద్ద రిలీఫ్ నరేష్ పాత్ర . అద్భుతంగా నటించి మెప్పించడమే కాకుండా నవ్వులు పూయించాడు . పవిత్రా లోకేష్ పాత్ర కూడా బాగుంది . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు రాణించారు .

సాంకేతిక వర్గం :

వివేక్ సాగర్ అందించిన సంగీతం హాయిగా ఉంది , అలాగే పిజి విందా ఛాయాగ్రహణం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . సుధీర్ బాబు ,అదితిరావ్ హైదరి లను మరింత అందంగా చూపించాడు విందా . శ్రీదేవి మూవీస్ అధినేత నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి విషయానికి వస్తే …… టైటిల్ తోనే ప్రేక్షకులను అలరించిన మోహనకృష్ణ స్క్రీన్ ప్లే పరంగా కూడా ఆకట్టుకున్నాడు . అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది . సుధీర్ బాబు చేత తనకు రావాల్సిన నటనని రాబట్టుకున్నాడు . మొత్తానికి తనదైన ముద్ర తో సక్సెస్ అందుకున్నాడు ఇంద్రగంటి .

ఓవరాల్ గా :

నిజంగా సమ్మోహనమే ఈ……. సమ్మోహనం

        Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All
విజయ్ ( సుధీర్ బాబు ) బొమ్మలతో గీసిన చిన్నపిల్లల పుస్తకం అచ్చు వేయించడానికి ప్రయత్నాలు చేస్తాడు . విజయ్ నాన్న సర్వేశ్ (నరేష్ )కి సినిమాలంటే ప్రాణం దాంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని సినిమాల్లో నటించాలని ఉత్సాహ పడుతుంటాడు అదే సమయంలో సమీరా రాథోడ్ ( అదితిరావ్ హైదరి ) హీరోయిన్ గా నటించే కుమ్మేస్తా సినిమా షూటింగ్ కోసం తన ఇంటిని ఫ్రీగా ఇస్తాడు . షూటింగ్ లో భాగంగా విజయ్ ఇంటికి వస్తుంది సమీరా అక్కడ సరైన తెలుగు పలకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో విజయ్ తగిన సలహాలు , సూచనలు ఇస్తాడు దాంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది . అయితే విజయ్ సమీరా కు తన ప్రేమ ని వ్యక్తపరిచినప్పుడు తిరస్కరిస్తుంది .సమ్మోహనం రివ్యూ