
‘రాజావారు రాణిగారు’ .. ‘ఎస్.ఆర్. కల్యాణ మంటపం’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకొని, యూత్ ను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా సెబాస్టియన్ PC 524 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాగున్నప్పటికీ సరైన టైం లో రిలీజ్ చేయకపోయేసరికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా తన నెక్స్ట్ చిత్రాన్ని రిలీజ్ కు సిద్ధం చేసాడు.
గోపీనాథ రెడ్డి డైరెక్షన్లో ‘సమ్మతమే’ అనే సినిమా చేసాడు. ప్రవీణ నిర్మించిన ఈ మూవీ లో కిరణ్ కు జోడిగా
చాందినీ చౌదరి నటించింది. ప్రస్తుతం అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. జూన్ 24న థియేటర్లలో విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ రొమాంటిక్ పోస్టర్ విడుదల చేసారు. ఈ పోస్టర్ లో చాందిని బట్టలు ఆరేస్తుండగా, కిరణ్ ఆమెను ప్రేమగా వాటేసుకోవడం కన్పిస్తోంది.