
‘రాజావారు రాణిగారు’ .. ‘ఎస్.ఆర్. కల్యాణ మంటపం’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకొని, యూత్ ను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా సెబాస్టియన్ PC 524 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాగున్నప్పటికీ సరైన టైం లో రిలీజ్ చేయకపోయేసరికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా తన నెక్స్ట్ చిత్రాన్ని రిలీజ్ కు సిద్ధం చేసాడు.
గోపీనాథ రెడ్డి డైరెక్షన్లో ‘సమ్మతమే’ అనే సినిమా చేసాడు. ప్రవీణ నిర్మించిన ఈ మూవీ లో కిరణ్ కు జోడిగా
చాందినీ చౌదరి నటించింది. ప్రస్తుతం అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు. బుధువారం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. ‘బుల్లెట్టులా నీ వైపే వస్తున్నానే’ అంటూ ఈ పాట సాగుతోంది. హీరోయిన్ ప్రేమలో పడిపోయిన హీరో ఆమె ప్రతి కదలికను ప్రత్యేకంగా చూస్తుంటాడు. ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని అపురూపంగా భావిస్తుంటాడు. ఆ నేపథ్యంలో వచ్చే పాట అని తెలుస్తుంది. శేఖర్ చంద్ర సంగీతాన్ని స్వరపరిచిన ఈ పాటకి సామ్రాట్ సాహిత్యాన్ని అందించగా రితేశ్ ఆలపించాడు.