
సమంత..ఇప్పుడు మళ్లీ అన్ని ఇండస్ట్రీ లలో హాట్ టాపిక్ అవుతుంది. నాగ చైతన్య తో పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించడం..కేవలం లేడి ఓరియంటెడ్ కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో దర్శకులు కాస్త పట్టించుకోవడం మానేశారు. కానీ చైతు తో విడాకుల అనంతరం సమంత మళ్లీ వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేడియా ఓరియంటెడ్ కథలతో పాటు ఐటెం సాంగ్ , వెబ్ సిరీస్ , గ్లామరస్ పాత్రలకు ఓకే చెపుతుంది. పుష్ప లో ఐటెం సాంగ్ చేసి పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం చేతినిండా సినిమాలు, బిజినెస్లు , యాడ్స్ ఇలా బిజీ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. తాజాగా తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌కి హెయిర్ కట్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. నేను మల్టీటాలెంట్‌ని. నేను చేసిన పనికి నువ్ ఇంకా నాకు డబ్బులు చెల్లించలేదు అని పేర్కొంది. దీనికి ప్రీతమ్ కూడా చంపెయ్ అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.