Homeగాసిప్స్హైదరాబాద్ ను వదిలిన సమంత

హైదరాబాద్ ను వదిలిన సమంత

samantha shifting to mumbai
samantha shifting to mumbai

నాగ చైతన్య మాజీ భార్య , హీరోయిన్ సమంత హైదరాబాద్ ను వదిలేసింది. విడాకుల తర్వాత సినిమాల ఫై పూర్తిగా ఫోకస్ చేసిన ఈమె..లేడీ ఓరియంటెడ్ , వెబ్ సిరీస్ లతో పాటు గ్లామర్ హీరోయిన్ పాత్రలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంది. కేవలం తెలుగు సినిమాలే కాదు హిందీలోనూ తన సత్తా చాటుకోవాలని సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ఈమె ముంబై కి షిఫ్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై లో దాదాపు మూడు కోట్ల రూపాలయలతో నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసిందట. అది త్వరలోనే పూర్తి కాబోతుందని .. ఆ ఇల్లు పూర్తైన తర్వాతనే గృహ ప్రవేశం చేస్తుందట. అప్పటి వరకూ ఓ హోటల్‌లో ఉంటుందని అంటున్నారు.

సమంత ఇప్పటికే గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా మూవీలో నటించింది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ‘కాతు వాకుల్ రెండు కాదల్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ షూట్ కూడా దాదాపుగా పూర్తైపోయింది. ఇక హిందీ లో పలు ఛాన్సులు వస్తున్నాయట. త్వరలోనే వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All