Homeగాసిప్స్విజయ్ సినిమాకు సమంత మూడు కోట్లు తీసుకుంటుందా..?

విజయ్ సినిమాకు సమంత మూడు కోట్లు తీసుకుంటుందా..?

Vijay Devarakonda To Romance Samantha

విడాకుల తర్వాత సమంత స్పీడ్ పెంచింది. ఓ పక్క లేడి ఓరియంటెడ్ సినిమాలకు ఓకే చెపుతూనే మరోపక్క ఐటెం సాంగ్స్ కు , హీరోయిన్ రోల్ కు ఓకే చెపుతూ కెరియర్ ను మళ్లీ స్పీడ్ చేస్తుంది. ప్రస్తుతం ఈమె శాకుంతలం తో పాటు యశోద మూవీస్ చేస్తుంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉంటె తాజాగా విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా కోసం సమంత 3 కోట్లు డిమాండ్ చేసిందని..ఆమె అడిగిన దానికి నిర్మాతలు ఓకే చెప్పినట్లు సమాచారం.

అంతకు ముందు ఇదే బ్యానర్ నిర్మించిన `పుష్ప` దిరైజ్ లో సమంత `ఊ అంటావా మావ ఊఊ అంటావా` పాటలో నటించింది. ఆ పాటలో నటించేందుకు 1.5 కోట్లు తీసుకుందిట.ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతలకు ఆ సినిమా ద్వారా భారీ లాభాలొచ్చాయి. అందుకే ఇప్పుడిలా కొత్తప్రాజెక్ట్ కి 3 కోట్లు ఇచ్చినట్లు అంటున్నారు. ఇది ఏమైనప్పటికి సమంత మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవ్వడం పట్ల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All