Homeటాప్ స్టోరీస్సమంత టిఆర్ఎస్ తరుపున పోటీ చేస్తుందా

సమంత టిఆర్ఎస్ తరుపున పోటీ చేస్తుందా

హీరోయిన్ సమంత తెలంగాణ చేనేత కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే , కాగా ఇప్పుడు ఓ వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది . దాని సారాంశం ఏంటంటే 2019 లో జరిగే ఎన్నికల్లో సమంత అసెంబ్లీ కి పోటీ చేయడం ఖాయమని అది కూడా టిఆర్ ఎస్ పార్టీ తరుపున పోటీ చేయడం ఖాయమని వినిపిస్తోంది . ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో సమంత పాల్గొంది పైగా కేటీ ఆర్ కు స్నేహితురాలు కూడా కావడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అంటున్నారు .

ఇక మామ నాగార్జున విషయానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నాడు , కాబట్టి నాగార్జున కూడా సమంత రాజకీయాల్లోకి వస్తానంటే అడ్డు చెప్పే అవకాశం ఉండదు . అయితే కెరీర్ మంచి పీక్ లో ఉన్న ఈ సమయంలో రాజకీయాల్లోకి అప్పుడే వస్తుందా అన్నది చూడాలి , కాకపోతే మొదటి నుండి సమంత కు సామాజిక సేవ చేయాలన్న తలంపు ఉంది అందులో భాగంగానే ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది సమంత . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All