Homeగాసిప్స్స‌మంత గుడ్ న్యూస్ చెప్ప‌బోతోందా?

స‌మంత గుడ్ న్యూస్ చెప్ప‌బోతోందా?

స‌మంత గుడ్ న్యూస్ చెప్ప‌బోతోందా?
స‌మంత గుడ్ న్యూస్ చెప్ప‌బోతోందా?

వివాహం త‌రువాత నుంచి స‌మంత కొత్త త‌ర‌హా చిత్రాల్లో మాత్రమే న‌టిస్తున్నారు. న‌ట‌న‌కు, పాత్ర‌కు ప్రాధాన్యం వున్న చిత్రాల్ని మాత్ర‌మే ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల్నిసొంతం చేసుకుంటున్నారు. ఇటీవ‌ల స‌మంత న‌టించిన రంగ‌స్థ‌లం, మ‌జిలీ, యూట‌ర్న్‌, ఓ బేబీ వంటి చిత్రాలు మంచి విజ‌యాల్ని సాధించి స‌మంత గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనే కాదు న‌ట‌నకు ప్రాధాన్యం వున్న పాత్ర‌ల్లోనూ రాణించ‌గ‌ల‌ద‌ని నిరూపించాయి.

అయితే ఇటీవ‌ల న‌టించిన త‌మిళ రీమేక్ `జాను` ఫ‌లితం మాత్రం స‌మంత‌ని నిరాశ‌ప‌రిచింది. త‌ను చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నా దిల్ రాజు కార‌ణంగా ఈ సిన‌మా చేయ‌క‌త‌ప్ప‌లేదు. మ్యాజిక్ జ‌రుగుతుంద‌ని భావించినా సినిమా అంత‌గా జ‌నాల‌కి ఎక్క‌క‌పోవ‌డంతో సామ్ కొంత డిస‌ప్పాయింట్ అయ్యార‌ట‌. తెలుగులో మ‌రో సినిమా అంగీక‌రించ‌ని స‌మంత ఇటీవ‌ల త‌మిళంతో న‌య‌న‌తార‌తో క‌లిసి `కాతువాకుల రెండు క‌థ‌ల్‌` చిత్రాన్నిఅంగీక‌రించింద‌ని తెలిసింది. దీనికి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌కుడు.

- Advertisement -

అయితే తాజాగా ఈ సినిమా నుంచి స‌మంత త‌ప్ప‌కుంద‌ని తెలిసింది. కార‌ణం ఏంట‌ని ఆరాతీస్తే సామ్ ప్రెగ్నంట్ అని, ఆ కార‌ణంగానే ఆమె ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంద‌ని కోలీవుడ్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల్లో నిజ‌మెంత వుంద‌న్న‌ది తెలియాలంటే సామ్ వివ‌ర‌ణ ఇవ్వాల్సిందే. ఈ వార్త నిజ‌మే అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి సామ్ ద్వారా గుడ్ న్యూస్ రాబోతంద‌న్న‌మాటే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All