Tuesday, August 9, 2022
Homeటాప్ స్టోరీస్సమంత ఖాతాలో మరో అవార్డ్.. ఫిల్మ్ చాంపియన్ (FC Disruptors) 2021 లిస్ట్ లో సమంత..!

సమంత ఖాతాలో మరో అవార్డ్.. ఫిల్మ్ చాంపియన్ (FC Disruptors) 2021 లిస్ట్ లో సమంత..!

Samantha Listed FC Disruptors 2021 for Family Man 2
 

ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ తో బాలీవుడ్ తెరంగేట్రం చేసింది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. ఆ వెబ్ సీరీస్ లో రాజీ పాత్రలో సమంత నటన ఆకట్టుకుంది. వెబ్ సీరీస్ హిట్ అవడమే కాకుండా సమంత పాత్రకు మంచి పేరు వచ్చింది. అయితే పేరు మాత్రమే కాదు ఎన్నో అవార్డులను సైతం ఆ పాత్ర ద్వారా రాబడుతుంది సమంత. ఆల్రెడీ ఓటీటీ & డిజిటల్ మార్కెట్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2021 లో సమంత బెస్ట్ ఫీమేల్ లీడ్ గా ఫ్యామిలీ మెన్ 2 కి అందుకుంది.

- Advertisement -

ఇక లేటెస్ట్ గా ఫిల్మ్ ఛాంపియన్ డిస్ రప్ టర్స్ 2021 లిస్ట్ లో కూడా సమంత స్థానం సంపాదించుకుంది. ప్రతిష్టాత్మక ఎఫ్సీ లిస్ట్ లో కూడా సమంత ఛాన్స్ కొట్టేసింది. నేషనల్ వైడ్ గా సమంత క్రేజ్ కు ఇది నిదర్శనమని చెప్పొచ్చు. ప్రస్తుతం సమంత గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

మొన్నటివరకు సౌత్ మార్కెట్ మాత్రమే ఉన్న సమంత ఫ్యామిలీ మెన్ 2 తో బాలీవుడ్ ఆడియెన్స్ ను మెప్పించింది. అందుకే శాకుంతలం సినిమా నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చుకుంటుందని చెబుతున్నారు. తప్పకుండా సమంత శాకుంతలంతో మరెన్నో రికార్డులను సృష్టిస్తుందని అంటున్నారు. ఎఫ్సీ 2021 టాప్ 20 లిస్ట్ లో సమంత 8వ స్థానంలో ఉంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts