Homeటాప్ స్టోరీస్చైతూ ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడ‌ట‌!

చైతూ ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడ‌ట‌!

చైతూ ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడ‌ట‌!
చైతూ ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడ‌ట‌!

మిహీకా బ‌జాజ్‌ని రానా త్వ‌ర‌లో వివాహం చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 12న త‌న‌కు కాబోయే శ్రీ‌మ‌తి ఈమే అంటూ రానా ఇన్‌స్టా గ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించాడు. ముంబై నేప‌థ్యంలో ఈవెంట్‌మేనేజ్‌మెంట్ కంప‌నీనీ ర‌న్ చేస్తున్న మిహీకా బ‌జాజ్ గ‌త కొంత కాలంగా రానాతో ల‌వ్‌లో వున్నారని వీరి వివాహం డిసెంబ‌ర్‌లో జ‌ర‌ప‌బోతున్నామ‌ని, లాక్‌డౌన్ త‌రువాత వివాహానికి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని సురేష్‌బాబు స్ప‌ష్టం చేశారు.

ఇదిలా వుంటే ఈ మంగ‌ళ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు రానా, మిహీకాల నిశ్చితార్థం జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని, బుధ‌వారం కుటుంబ స‌భ్యులం అంతా ఫార్మ‌ల్‌గా క‌లిశామ‌ని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట పాల్గొంది. ఈ సంద‌ర్భంగా సామ్ ఇన్‌స్టాగ్ర‌మ్‌లో నాగ‌చైత‌న్య ఫొటోని షేర్ చేస్తూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌స్తుతం సామ్ పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -

చై అందంపై ఈ సంద‌ర్భంగా కామెంట్ చేయ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు. `అమ్మ, ఆంటీలు, చెల్లెల్లు, స్నేహితులు అంద‌రిని పంపిన త‌రువాత ఇప్పుడే ఇన్  స్టాగ్రామ్‌కు స‌మ‌యం చిక్కింది. నా భ‌ర్త చాలా హ్యాండ్స‌మ్‌గా వున్నాడు చూడండి. నా భర్త ప్రస్తుతం ఎక్కడో ఒక పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు` అంటూ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All