
సమంత పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే సమంత నటిస్తున్న చిత్రాల తాలూకా ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేసి సంతోష పరుస్తున్నారు. ఈ తరుణంలో శాకుంతలం నుండి అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.
గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమా గుణ నిర్మించిన ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని గత కొంత కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అప్పడెప్పుడో శాకుంతం స్టార్టింగ్ లో ఈ చిత్రంలోని సమంత లుక్ అంటూ ఓ పోస్టర్ ని విడుదల చేసిన మేకర్స్ ఆ తరువాత దీనికి సంబంధించిన అప్ డేట్ ని విడుదల చేయలేదు.
ఈరోజు సమంత పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్ర బృందం శాకుంతలంగా సమంత ముగ్ధమనోహరమైన రూపానికి సంబంధించిన లుక్ ని విడుదల చేసింది. వూట్ సారీలో వయ్యారాలు పోతూ చెలికాడికై విరహ వేదనతో ఎదురుచూస్తున్న దేవకన్య కావ్యనాయకిలా కనిపిస్తున్న సమంత లుక్ చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. నాభి అందాలతో ముగ్ధమనోహరిగా సామ్ కనిపిస్తున్న తీరు విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇక ఈ మూవీ లో ఈ చిత్రంలో సామ్ కు జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించారు. అదితి బాలన్ అనన్య నాగళ్ల ప్రకాష్ రాజ్ మోహన్ బాబు గౌతమి కబీర్ బేడీ మధుబాల కబీర్ దుహన్ సింగ్ అల్లు అర్హ వర్షిణి సౌందరరాజన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.