
సమంత ప్రస్తుతం తన మకాం ను ముంబై కి మార్చే పనిలో ఉందా..అంటే అవుననే చెప్పాలి. నాగ చైతన్య తో పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించడం..కేవలం లేడి ఓరియంటెడ్ కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో దర్శకులు కాస్త పట్టించుకోవడం మానేశారు. కానీ చైతు తో విడాకుల అనంతరం సమంత మళ్లీ వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేడియా ఓరియంటెడ్ కథలతో పాటు ఐటెం సాంగ్ , వెబ్ సిరీస్ , గ్లామరస్ పాత్రలకు ఓకే చెపుతుంది. పుష్ప లో ఐటెం సాంగ్ చేసి పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు నార్త్ సినిమాల ఫై ఫోకస్ చేసిన సామ్..ముంబై లోనే ఉండాలని భావిస్తుంది. ముంబైలో సముద్రం ఫేసింగ్ ఫ్లాట్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సముద్రం ఫేసింగ్ లో ముంబైలో ఓ చోట ఖరీదైన బిల్డింగ్స్ ని కడుతున్నారు. అందులో ఇటీవల ఫ్లాట్స్ చూసిన సమంత ఒకటి కొందామని ఫిక్స్ అయిందట. నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లాట్ ని దాదాపు 3 కోట్లు పెట్టి కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం.