
అల్లు అర్జున్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూపొందించిన చిత్రం `అల వైకుంఠపురములో`. అల్లు అరవింద్‌తో కలిసి ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ ఆనందంలో వున్న త్రివిక్రమ్ వెంటనే మరో భారీ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్నారు. హారిక అండ్ హాసిని కరియేషన్స్ బ్యానర్‌తో పాటు ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించబోతున్నారు.
ఎన్టీఆర్ నటించనున్న 30వ చిత్రమిది. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఇటీవలే చిత్ర బృందం అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా ఎవరు నటిస్తారు. టెక్నీషియన్స్ ఎవరు పనిచేస్తారనే విషయాల్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. 2021 సమ్మర్ కి రిలీజ్ కానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుందని ఇటీవల ప్రచారం మొదలైంది.
తాజా సమాచారం ప్రకారం ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్‌లు వుంటారని, అందులో ఓ హీరోయిన్‌గా రష్మిక మందన్నని అనుకుంటున్నారని. మెయిన్ హీరోయిన్‌గా సమంత పేరు ప్రధానంగా వినిపిస్తోందిని తెలిసింది. సమంత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన `అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ చిత్రాల్లో నటించి హ్యాట్రిక్ హిట్‌లని సొంతం చేసుకుంది. తాజాగా ఎన్టీఆర్ సినిమాకు కన్ఫమ్ అయితే త్రివిక్రమ్‌తో నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్‌గా రికార్డు సాధిస్తుంది.