
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ చిన్న యాడ్ చేసిన కోట్లాది రూపాయిలు తీసుకుంటారు. అలాంటిది చిరంజీవి మూవీ కి గాను ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట. దీనికి వీరి స్నేహమే కారణమని అంటున్నారు. సల్మాన్ స్నేహం కోసం ఏమైనా చేస్తుంటాడు. ఒకసారి ఆయన నమ్మడంటే ప్రాణం పోయేవరకు ఆ నమ్మకం అలాగే ఉంటుందని బాలీవుడ్ వర్గాలు అంటారు. అలాంటిది తాజాగా చిరంజీవి ఫ్యామిలీ తో ఉన్న ఉన్న అనుబంధం తో చిరు సినిమాలో ఓ కీలక రోల్ చేసేందుకు ఓకే చెప్పాడు.
మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ ఆధారంగా రూపొందుతున్న`గాడ్ ఫాదర్`లో అతిథి పాత్రలో నటించడానికి సల్మాన్ ఖాన్ అంగీకరించాడు. దాంతో అతని రెమ్యునరేషన్ లో భాగంగా మేకర్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారట. అయితే రెమ్యూనరేషన్ ఇస్తే సినిమాకు సంతకం చేయనని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారట. డబ్బులు తీసుకోకుండా సినిమా చేయాలనే శరతు పెట్టాడని అంటునాన్రు. ఇదంతా దేనికోసం అంటే మెగాస్టార్ చిరంజీవితో తనకు ఉన్న స్నేహం కారణంగానే అని చెపుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ కావడం తో సల్మాన్ గొప్పతనం గురించి అంత మాట్లాడుకుంటున్నారు.
ఈ మూవీ లో నయనతార ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తుండగా , బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఆయన జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ కి పుష్పగుచ్చం అందచేసి గ్రాండ్ వెల్కమ్ తెలియచేసారు. సల్మాన్ కి పుష్ప గుచ్చం ఇస్తున్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి.. ”మీరు ఈ సినిమాలో జాయిన్ అవ్వడం అందరిని ఉత్తేజపరిచింది. మా ఉత్సాహం మీ రాకతో మరింత రెట్టింపు అయింది. మీతో స్క్రీన్‌ను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలో మీ పాత్ర ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు” అంటూ ట్వీట్ చేశారు.