Homeటాప్ స్టోరీస్సల్మాన్ కు గ్రాండ్ వెల్ కం చెప్పిన చిరంజీవి

సల్మాన్ కు గ్రాండ్ వెల్ కం చెప్పిన చిరంజీవి

Salman Khan joins the sets of Chiranjeevi's 'Godfather'
Salman Khan joins the sets of Chiranjeevi’s ‘Godfather’

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ ని పూర్తి చేసి రిలీజ్ కు చేసాడు. భోళా శంకర్ , గాడ్ ఫాదర్ తో పాటు బాబీ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం మోహన్ రాజా డైరెక్షన్లో చేస్తున్న గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హట్ అయిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఈ మూవీ లో నయనతార ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తుండగా , బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఆయన జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ కి పుష్పగుచ్చం అందచేసి గ్రాండ్ వెల్కమ్ తెలియచేసారు. సల్మాన్ కి పుష్ప గుచ్చం ఇస్తున్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి.. ”మీరు ఈ సినిమాలో జాయిన్ అవ్వడం అందరిని ఉత్తేజపరిచింది. మా ఉత్సాహం మీ రాకతో మరింత రెట్టింపు అయింది. మీతో స్క్రీన్‌ను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలో మీ పాత్ర ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు” అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All