Homeటాప్ స్టోరీస్మే ఫస్ట్ వీక్ నుండి సెట్స్ పైకి సలార్

మే ఫస్ట్ వీక్ నుండి సెట్స్ పైకి సలార్

ప్రభాస్ సలార్ లో కన్ఫర్మ్ అయిన మరో భామ
ప్రభాస్ సలార్ లో కన్ఫర్మ్ అయిన మరో భామ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. దాదాపు నలబై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన పార్ట్ ను కూడా త్వరత్వరగా ఫినిష్ చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. రీసెంట్ గా కెజిఎఫ్ 2 మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడమే కాదు ..నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో సలార్ మూవీ ఫై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కొత్త షెడ్యూల్ ను మే మొదటి వారం నుంచి హైదరాబాద్లో ప్రారంభించబోతున్నారట. అందుకు ప్రభాస్ సైతం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని.. మే ఫస్ట్ వీక్ లోనే శ్రుతి హాసన్ తో కలిసి ఆయన రంగంలోకి దిగబోతున్నాడని అంటున్నారు. ఇక ఈ షెడ్యూల్ కంటిన్యూగా జరిపి టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All