స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్బంగా ” సరిహద్దులో నువ్ లేకుంటే కనుపాప కంటినిండుగా నిదురపోదురా ” అంటూ సాగే పాటని రిలీజ్ చేసారు . భారత సైనికుల త్యాగానికి , ధీరత్వానికి ప్రతీకగా నిలిచింది ఈ పాట . భారత పతాక రెపరెపలాడుతుందంటే అది ముమ్మాటికీ సైనికుల పోరాట పటిమ , త్యాగఫలం అంటూ సాగే ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా విశాల్ గాత్రదానం చేసాడు .
బాలీవుడ్ సంగీతద్వయం విశాల్ – శేఖర్ సంగీతం అందించారు ఈ పాటకు . ఆవేశపూరితంగా మిలిటరీ సోల్జర్ గా అల్లు అర్జున్ నటిస్తుండగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది . వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .