Homeటాప్ స్టోరీస్సింగిల్స్ డే రోజున యూత్ కు సందేశమిస్తున్న సాయి తేజ్

సింగిల్స్ డే రోజున యూత్ కు సందేశమిస్తున్న సాయి తేజ్

sai dharam tej wishes on singles day with solo bratuke so beteru
sai dharam tej wishes on singles day with solo bratuke so beteru

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సాయి తేజ్ గా చిత్రలహరి చిత్రం నుండి మారిన విషయం తెల్సిందే. వరాసగా ప్లాపులతో డబల్ హ్యాట్రిక్ కొట్టిన సాయి తేజ్, చిత్రలహరి చిత్రం ద్వారా కొంత ఊరట పొందాడు. స్టార్టింగ్ లో ఒక ఊపు మీదున్న కెరీర్ ప్లాపుల తర్వాత బాగా స్లో అయింది. చిత్రలహరి డీసెంట్ హిట్ సాధించినా, ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ పడితే కానీ మళ్ళీ కెరీర్ కు ఊపు రాదు. ప్రస్తుతం సాయి తేజ్ చేస్తోన్న ప్రతిరోజూ పండగే చిత్రం తాను ఎదురుచూస్తోన్న బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఇస్తుందని ఆశిస్తున్నాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. ఇటీవలే టైటిల్ సాంగ్ విడుదల చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. టీజర్ కూడా జనాలను ఆకట్టుకుంది. ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందిస్తున్న భావన ప్రేక్షకులకైతే కలిగింది. మారుతి సినిమాలు ఎంటర్టైన్మెంట్ కు గ్యారంటీ కావడంతో ప్రతిరోజూ పండగేతో తన కెరీర్ మళ్ళీ పండగలా మారిపోతుందని ఆశిస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ చిత్రం క్రిస్మస్ సెలవుల ముందు విడుదల కానుంది.

ప్రతిరోజూ పండగే విడుదల కాకుండానే సాయి తేజ్ తన తర్వాతి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించబోయే చిత్రంలో సాయి తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సోలో బ్రతుకే సో బెటరు అని టైటిల్ కన్ఫర్మ్ చేసిన విషయం కూడా తెల్సిందే. దసరా సందర్భంగా ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఈరోజు సింగిల్స్ డే కావడంతో ఫస్ట్ లుక్ స్టిల్ ను కూడా విడుదల చేసారు. ఆ స్టిల్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు సాయి తేజ్. దాంతో పాటు కాప్షన్ కూడా జత చేసాడు. “సింగిల్స్ గా ఉన్న డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. మీ అందరికీ హ్యాపీ సింగిల్స్ డే.. ఎప్పుడైనా ఎక్కడైనా సోలో బ్రతుకే సో బెటరు” అని జోడించాడు. దీంతో పాటు జై సింగిల్ ఆర్మీ అంటూ హ్యాష్ ట్యాగ్ ను కూడా జతచేసాడు.

- Advertisement -

అసలు ఈ సింగిల్స్ డే ఎలా వచ్చిందంటే.. మొదట దీన్ని చైనా వాళ్ళు మొదలుపెట్టారు. ఈరోజు నవంబర్ 11 అంటే 11/11, అన్నీ 1 లు వచ్చాయి కాబట్టి ఈరోజు సింగిల్స్ డే ను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇక చిత్రం విషయానికి వస్తే సోలో బ్రతుకే సో బెటరు చిత్రాన్ని సుబ్బు తెరకెక్కించనున్నాడన్న విషయం మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. ప్రముఖ సీనియర్ దర్శకుడు బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ప్రతిరోజూ పండగే చిత్రానికి కూడా థమన్ స్వరకర్త. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకూ పాటలు హిట్ అయినా కానీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. మరి ఈ రెండు చిత్రాలతోనైనా థమన్, సాయి తేజ్ జోడి హిట్ కొడుతుందేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All