Homeటాప్ స్టోరీస్మాట‌నిల‌బెట్టుకున్న మెగామేన‌ల్లుడు!

మాట‌నిల‌బెట్టుకున్న మెగామేన‌ల్లుడు!

మాట‌నిల‌బెట్టుకున్న మెగామేన‌ల్లుడు!
మాట‌నిల‌బెట్టుకున్న మెగామేన‌ల్లుడు!

ఈ రోజుల్లో ఒక మాట ఇస్తే ఆ మాట‌కు క‌ట్టుబ‌డి వుండే వాళ్లు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తుంటారు. కానీ మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ మాత్రం ఇచ్చిమ‌ట‌కు క‌ట్టుబ‌డి త‌ను ఇచ్చిన మాట‌ని నిల‌బెట్టుకున్నారు. ప‌ది మందికి ఆద‌ర్శంగా నిలిచారు. విజ‌య‌వాడ‌కు చెందిన అమ్మ ఆద‌ర‌ణ సేవా వృద్ధాశ్ర‌మం వారు త‌మ ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ సాయిధ‌ర‌మ్ తేజ్‌కు ఓ పోస్ట్‌ని గ‌తేడాది ట్యాగ్ చేశారు. వృద్ధాశ్ర‌మం ఆర్ఇక ఇబ్బందుల కార‌ణంగా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

దీంతో స‌ద‌రు సంస్థ త‌మ వృద్ధాశ్ర‌మ నిర్మాణానికి స‌హాయ స‌హ‌కారాలు అందించి పూర్తి చేయండ‌ని కోరింది. దీంతో సాయిధ‌ర‌మ్‌తేజ్ స్పందించి మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్ర‌కారం త‌న పుట్టిన రోజున ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన ఫ్యాన్స్ పుట్టిన రోజు కోసం బ్యాన‌ర్స్‌, కేక్ క‌టింగ్‌లు లాంటి హంగామా చేయ‌కుండా ఆ డ‌బ్బుని వృద్ధాశ్ర‌మం కోసం ఖ‌ర్చు చేశారు.

- Advertisement -

దీంతో అభిమానుల, హీరో చేయి వేయ‌డంతో అమ్మ ఆద‌ర‌ణ వృద్ధాశ్ర‌మ బిల్డింగ్ నిర్మాణం పూర్త‌యింది. దీంతో ఆనందాన్ని ప‌ట్ట‌లేని వృద్ధాశ్ర‌మ వాసులు సాయిధ‌ర‌హ్తేజ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఏడాది పాటు వృద్ధాశ్ర‌మానికి త‌మ స్పాన్స‌ర్ షిప్ అందించి అండ‌గా వుంటామ‌ని సాయి ర‌మ్‌తేజ్ వెల్ల‌డించ‌డంతో ఆయ‌న‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All