Homeటాప్ స్టోరీస్వాళ్లిద్దరూ ఆ బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ వేసేసినట్లేగా!

వాళ్లిద్దరూ ఆ బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ వేసేసినట్లేగా!

వాళ్లిద్దరూ ఆ బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ వేసేసినట్లేగా!
వాళ్లిద్దరూ ఆ బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ వేసేసినట్లేగా!

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కు కొదవే లేదు. ఇక్కడ ఎన్నో రకాల సెంటిమెంట్స్ ఉంటాయి. అయితే అందులో ప్రధానమైనది మాత్రం హిట్ సెంటిమెంట్ లేదా ప్లాప్ సెంటిమెంట్. ఏ సెంటిమెంట్ ఫాలో అయినా హిట్ కోసమే. ఇండస్ట్రీ కాంబినేషన్స్ కూడా హిట్, ప్లాప్ సెంటిమెంట్ ప్రకారమే నడుస్తాయి. ఏదైనా కాంబినేషన్ హిట్ అయితే దాన్ని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా మళ్ళీ రిపీట్ చేయాలని భావిస్తారు. అయితే ప్లాప్ కాంబినేషన్ అయితే మళ్ళీ పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపరు. ట్రేడ్ కూడా ఇందుకు అనుకూలంగా ఉండదు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్లాప్ కాంబినేషన్ కోసం వరసగా ప్రయత్నిస్తూ వచ్చింది.

ఒకటి తర్వాత ఒకటి సినిమాలు ప్లాపవుతూ వచ్చాయి. అయినా సినిమాలను కంటిన్యూ చేసారు. మొత్తానికి హిట్ కొట్టారు. వాళ్లే సాయి ధరమ్ తేజ్, థమన్. ఈ హీరో, సంగీత దర్శకుడు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. సినిమాల పరంగానే కాకుండా బయట కూడా ఇద్దరూ కలిసి తిరుగుతారు. క్రికెట్ బాగా ఆడతారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఇద్దరూ ఇప్పటివరకూ కలిసి నాలుగు సినిమాలు చేసారు. నాలుగు చిత్రాలూ కూడా అట్టర్ ప్లాపులుగా మిగిలాయి.

- Advertisement -

సాయి తేజ్, థమన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం తిక్క. పాటలు బాగుంటాయి కానీ సినిమా ఘోరంగా విఫలమైంది. అలాగే జవాన్, విన్నర్ కూడా సాంగ్స్ బాగున్నా సినిమా ఫేట్ మారలేదు. ఇక ఇంటెలిజెంట్ సినిమాకైతే పాటలు కూడా బాగోవు. సినిమా రిజల్ట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి మళ్ళీ పని చేయరేమో అనుకున్నారు. అయితే ప్రతిరోజూ పండగే చిత్రానికి మళ్ళీ పనిచేసారు. పాటలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. సినిమా రిజల్ట్ కూడా అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ రేంజ్ ను అందుకుంటోంది. దీంతో మొత్తానికి ఇద్దరూ కలిసి బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసారంటూ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

సాయి తేజ్ తర్వాతి చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All