
జయం ఫేమ్ సదా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందా అంటే అవుననే చెప్పాలి. జయం సినిమా తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..మొదటి చిత్రంతోనే యూత్ ను కట్టిపడేసింది. తేజ డైరెక్షన్లో నితిన్ హీరోగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు లవ్ ఎంటర్టైనర్ గా వచ్చి సూపర్ హిట్ సాధించింది. ఈ మూవీ తర్వాత విక్రమ్ సరసన శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించింది.
ఈ సినిమా కూడా ఘన విజయం సాధించడం తో అమ్మడికి వరుస పెట్టి తెలుగు, తమిళ్ ఛాన్సులు వచ్చాయి. కాకపోతే అవేవి కూడా పెద్దగా విజయాలు సాదించకపోవడం , కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడికి ఛాన్సులు తక్కువయ్యాయి. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లంతా రీ ఏంటీ ఇస్తూ తల్లి పాత్రల్లో , వదిన పాత్రల్లో మెప్పిస్తున్నారు. సదా కూడా మరోసారి రీ ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సోషల్ మీడియా లో హాట్ హాట్ షూట్స్ తో ఛాన్సుల కోసం గాలం వేస్తుంది.