Homeటాప్ స్టోరీస్సాహో రివ్యూ

సాహో రివ్యూ

Saaho Review in Telugu
Saaho Poster

సాహో రివ్యూ
నటీనటులు : ప్రభాస్‌,శ్రద్ధా కపూర్,జాకీ ష్రాఫ్,అరుణ్ విజయ్,చంకి పాండే,టిను ఆనంద్
నిర్మాత : వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ కుమార్, ఉప్పలపాటి భూషణ్ కుమార్
దర్శకత్వం : సుజీత్
రేటింగ్ : 3/5 
విడుదల తేదీ : 30 ఆగస్టు 2019

ఆకాశాన్నంటే అంచనాలు, మూడు వందల కోట్ల బడ్జెట్, రెండేళ్ల శ్రమ, మరో ప్యాన్ ఇండియా మూవీ రిలీజ్ మొదటి రోజు టికెట్ కోసం ఎప్పుడూ చూడని హంగామా.. సాహో గురించి చెప్పాలంటే ఈ వర్ణన సరిపోతుంది. మరి ఇన్ని అంచనాల నడుమ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో కూడా ఒకసారి చూసేద్దాం.

- Advertisement -

కథ :
అతి భయంకరమైన మాఫియా ఉండే వాజీ సిటీలో ఆధిపత్యం కోసం పోరు మొదలవుతుంది. అండర్ వరల్డ్ డాన్ పృథ్వీ రాజ్ (టిను ఆనంద్) తన సామ్రాజ్యానికి కొడుకు దేవరాజ్ (చంకి పాండే)ను అధిపతి చేయాలనుకుంటాడు. అయితే దీనికి వ్యతిరేకంగా రాయ్ (జాకీ ష్రాఫ్) పనిచేస్తుంటాడు. ఇదే సమయంలో ముంబైలో రెండు వేల కోట్లతో వస్తున్న ఒక షిప్ పేలిపోతుంది. అయితే ఆ డబ్బుని తిరిగి తెస్తానని రాయ్ కొడుకు విశ్వక్ (అరుణ్ విజయ్) చెప్తాడు. ఇదే సమయంలో ముంబై పోలీసులు ఈ దొంగతనం కేసును చేధించడానికి అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌)ని రంగంలోకి దించుతారు. అతను క్రైమ్ బ్రాంచ్ కు చెందిన అమృత నాయర్ (శ్రద్ధా కపూర్) తో కలిసి ఈ కేసును ఎలా చేధించాడు అన్నది మిగతా కథ.

కథనం :
కేవలం ఒకే ఒక్క మూవీ అనుభవమున్న దర్శకుడు.. మూడు వందల కోట్ల బడ్జెట్. మొదటినుండి ఈ రెండు కలిపి చదవడానికి ప్రేక్షకులకు పెద్ద సింక్ అవ్వలేదు. ప్రభాస్ ఇంత పెద్ద బాధ్యత సుజీత్ కు అప్పగించి ఏమైనా రిస్క్ చేశాడా అని కూడా అనుకున్నారు. అయితే టీజర్, ట్రైలర్ చూసాక వారి అనుమానాలన్నీ దాదాపుగా తొలగిపోయాయి. స్లిక్ అండ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడబోతున్నామన్న ఫీలింగ్ ప్రేక్షకులలో కలిగించడంలో సుజీత్ సక్సెస్ అయ్యాడు.

సాహోలో మొదటి నుండి హైలైట్ అయింది కూడా ఇదే. ఇదో ఒక పక్కా యాక్షన్ ఫిల్మ్ అని. అయితే అదే ఈ సినిమాకు మైనస్ గా కూడా మారింది. మొదటినుండీ యాక్షన్ సీన్లను ఎలా డిజైన్ చెయ్యాలో అన్నదానిపై దృష్టి పెట్టిన సుజీత్, కథపై ఇంకొంచెం వర్క్ చేసుంటే రిజల్ట్ అద్భుతంగా ఉండేది.

మన వాళ్లకు “లార్గో వించ్” అంటే ఎందుకంత ప్రేమో అర్ధం కాదు. పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాపై తెలుగు వాళ్ళ దండయాత్ర ఇంకా కొనసాగుతోంది. మొన్న అజ్ఞాతవాసి, నేడు సాహో. ఒకసారి వర్కౌట్ అవ్వనప్పుడు రెండోసారి ఎందుకు ప్రయత్నించడమో సుజీత్ కే తెలియాలి. నిజమే సుజీత్ ప్రభాస్ కు ఆరేళ్లకు ముందే ఈ కథ చెప్పాడు. అయితే అజ్ఞాతవాసి రిజల్ట్ చూసాకైనా వీళ్ళు కొంచెం ఇంట్రోస్పెక్ట్ చేసుకుని ఉండాల్సింది.

అలా అని సాహో మరీ తీసి పారేయల్సన సినిమా కాదు. యాక్షన్ మూవీ లవర్స్ కు ఫుల్లుగా కాకపోయినా ఎంతో కొంత కిక్కయితే వస్తుంది. ట్రైలర్ లో చూపించిన బైక్ ఛేజింగ్ 11 నిమిషాల పాటు ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తుంది. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్, ఆఖరి ముప్పై నిముషాలు అక్కడ వచ్చే ట్విస్ట్స్ బాగున్నాయ్.

అయితే వీటి మధ్యలో వచ్చే వ్యవహారమే అంతా సిల్లీగా ఉంది. దీని వల్ల 350 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ ఒక సగటు సినిమాగా మిగిలిపోతుంది.

నటీనటులు :
సాహో, ప్రభాస్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. యాక్షన్ సినిమాలకు తగ్గ కటౌట్ ఉన్న ప్రభాస్, ఫైట్స్, ఛేజ్ సీక్వెన్స్ అప్పుడు చెలరేగిపోయాడు. హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. విలన్లు డజన్ల కొద్దీ ఉన్నా చాలా మటుకు తెలీని ముఖాలు ఉండడంతో తెలుగు వారికి ఎంత వరకూ ఎక్కుతుందో చూడాలి. అందరిలోకీ చంకీ పాండేకు కొంత ప్రాధాన్యమున్న రోల్ వచ్చింది. మిగతావారంతా మామూలే. మురళి శర్మ, వెన్నెల కిషోర్ పర్వాలేదు.

సాంకేతిక వర్గం :
పాటల్లో ఎక్కువ బాలీవుడ్ శబ్దాలు వినిపించినా చూడటానికి చాలా బాగున్నాయి. సాంగ్స్ టేకింగ్ వండర్ఫుల్ గా ఉంది. గిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. యాక్షన్ సినిమాలకు తగ్గ ఔట్ పుట్ ఇచ్చాడు. మాది సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతీ ఫ్రేమ్ కలర్ ఫుల్ గా తీర్చిదిద్దాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కి ఢోకా లేదు. నిర్మాతలు చేతికి ఎముక లేని విధంగా ఖర్చుపెట్టారు. ఇక దర్శకుడు సుజీత్, కథ విషయంలో పూర్తిగా నిరాశపరిచాడు. కథనం ఇంకొంచెం బెటర్ అండ్ ఎంగేజింగ్ వెర్షన్ రాసుకుని ఉండాల్సింది.

చివరగా :
భారీ అంచనాలు ఈ సినిమాకు ప్రతికూలంగా పనిచేసే అవకాశముంది. సాహో నుండి ఏదో అద్భుతం ఆశిస్తే చివరికి నిరాశ తప్పదు. అంచనాలు లేకుండా వెళితే ఓ మోస్తరుగా ఎంజాయ్ చేయించగలిగే సగటు యాక్షన్ చిత్రం సాహో. ఈ సినిమా వసూళ్లు ప్రభాస్ స్టామినా మీదే ఆధారపడి ఉన్నాయి.

ఓ’సాహో’.. ఓ’సాహో’

Click Here: Saaho Movie Review in English

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All