Homeటాప్ స్టోరీస్దర్శకుడిగా తొలి అడుగు వేస్తోన్న సెన్సేషనల్ డైలాగ్ రైటర్

దర్శకుడిగా తొలి అడుగు వేస్తోన్న సెన్సేషనల్ డైలాగ్ రైటర్

దర్శకుడిగా తొలి అడుగు వేస్తోన్న సెన్సేషనల్ డైలాగ్ రైటర్
దర్శకుడిగా తొలి అడుగు వేస్తోన్న సెన్సేషనల్ డైలాగ్ రైటర్

ఆరెక్స్ 100 ఒక సంచలనం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కంటెంట్ పరంగా, డైలాగ్స్ పరంగా ఈ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుంది. దర్శకుడిగా అజయ్ భూపతికి, మాటల రచయితగా సయ్యద్ కు సినీ ప్రయాణం ఈ సినిమాతోనే మొదలైంది. వీరిద్దరూ ఇప్పుడు మరోసారి మహా సముద్రం సినిమాకు కలిసి పనిచేస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తోన్న మహా సముద్రం సినిమాకు కూడా సయ్యద్ మాటలు అందిస్తున్నాడు.

ఇంకా ప్రశాంత్ వర్మతో కలిసి కల్కి, జాంబీ రెడ్డి సినిమాలకు కూడా డైలాగ్స్ అందించాడు. ఇవి కాకుండా శ్రీహాన్ ప్రొడక్షన్స్ లో ఒక వెబ్ ఫిల్మ్, సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తోన్న సినిమాకు కూడా పనిచేస్తోన్న సయ్యద్ దర్శకుడిగా తన మొదటి ప్రయత్నానికి అడుగులు పడ్డాయి.

- Advertisement -

సయ్యద్ ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు కథ చెప్పడం, వారికి నచ్చడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All