Homeటాప్ స్టోరీస్ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

rx 100 director fires on review writersఆర్ ఎక్స్ 100 చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అజయ్ భూపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు . మొదటి మూడు రోజుల్లో రివ్యూ లు రాకుండా , రాయకుండా బ్యాన్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శకుడు అజయ్ భూపతి . జూలై 12న ఆర్ ఎక్స్ 100 చిత్రం విడుదలైంది అయితే రివ్యూలు అంతగా బాగో రాలేదు కానీ వసూళ్లు మాత్రం దిమ్మ తిరిగేలా వస్తున్నాయి . ఇప్పటివరకు 9 కోట్లకు పైగా షేర్ సాధించి ట్రేడ్ విశ్లేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది . ఇక తాజాగా విశాఖపట్టణం లో ఆర్ ఎక్స్ 100 చిత్ర విజయోత్సవ వేడుకలు నిర్వహించారు కాగా ఆ వేడుకలో రివ్యూ లపై బ్యాన్ విధించాలని మంత్రి ఘంటా శ్రీనివాసరావు ని కోరాడు అజయ్ భూపతి .

దర్శకుడి అభ్యర్ధన కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కూడా స్పందించాడు . సినిమా విడుదలైన మూడు రోజుల పాటు రివ్యూ లు రాకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆమేరకు ముఖ్యమంత్రి తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసాడు మంత్రి ఘంటా . సినిమాలో ఉన్న కంటెంట్ ని చూడకుండా కేవలం కొద్దీ నిమిషాల పాటు ఉన్న రొమాన్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకొని విమర్శలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు అజయ్ భూపతి . ఈ దర్శకుడు ఇంతకుముందు కూడా హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు . ఇప్పుడేమో మీడియా పై విమర్శలు చేస్తున్నాడు .

- Advertisement -

English Title: rx 100 director fires on review writers

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts