
ఏపీ సర్కార్ ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలకు గుడ్ న్యూస్ అందజేశారు. మొన్నటి వరకు ఏపీలో సినిమా టికెట్ ధరలు దారుణంగా ఉండగా..ఇప్పుడు భారీగా పెంచేశారు. కొత్తగా జీవో తీసుకొచ్చి టికెట్ ధరలు పెంచిన సర్కార్..ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు మరింత పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఇది పది రోజుల వరకే వర్తిస్తుందని తెలియజేస్తూ ఓ మెమోను విడుదల చేశారు. సినిమా బడ్జెట్‌ను అనుసరించి రూ.75 పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇక పెంచిన ధరలతో ఏపీ లో టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.
కార్పొరేషన్స్‌లో అయితే..
సింగిల్ స్క్రీన్స్ -236
మల్టీప్లెక్స్ – 265
మున్సిపాలిటీస్‌లో అయితే
సింగిల్ స్క్రీన్స్ – 206
మల్టీప్లెక్స్ – 236
ఇతర ప్రాంతాల విషయానికి వస్తే…
సింగిల్ స్క్రీన్స్ – 195
మల్టీప్లెక్స్ – 206
ఆర్ఆర్ఆర్ మూవీకి రిలీజ్ ముందు.. ఏపీలో ఇలా టికెట్ ధరలను పెంచడం అనేది మంచి పరిణామమని చిత్ర పరిశ్రమ భావిస్తుంది. అలాగే ఐదు ఆటలను ప్రదర్శించుకోవచ్చునని ఇది వరకే ప్రభుత్వం జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే.