
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. మరికొద్ది గంటల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ఎలా ఉందొ..? తమ అభిమాన నటులు ఏ రేంజ్ లో నటించారో..? రాజమౌళి సినిమాను ఎలా తెరకెక్కించారో..? ఫస్ట్ డే ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో..చూడాలని యావత్ సినీ లోకం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ఒకటి రెండు కాదు ఏకంగా 12 సార్లు చూశానని..అయినప్పటికీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది తెలిపి ఆనందం నింపారు RRR, VFX హెడ్ శ్రీనివాస మోహన్.
కొద్దిరోజుల క్రితమే సినిమాపై ఉత్కంఠగా ట్వీట్ చేసిన ఆయన తాజాగా మరోసారి సాలిడ్ ట్వీట్ చేసి ఆసక్తి నింపారు. అన్ని ఫార్మాట్లలో సినిమాను 12 సార్లు చూశానని మరియు పెద్ద స్క్రీన్‌పై మళ్లీ మళ్లీ చూడటానికి ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. RRR మూవీ, RRRepeat మోడ్ ఆన్‌లో ఉంది. బిగ్ స్క్రీన్‌పై ప్రతి ఫార్మాట్‌లో 12 సార్లు చూశాను, ప్రతి వీక్షణతో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రేక్షకుల స్పందన చూడటానికి వేచి ఉండలేము అని, 12 గంటల సమయం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. #RRRFromTomorrow హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.