Homeటాప్ స్టోరీస్అప్పటికంటే..ఇప్పుడు మరింత తెగాయట ఆర్ఆర్ఆర్ టికెట్స్ ..

అప్పటికంటే..ఇప్పుడు మరింత తెగాయట ఆర్ఆర్ఆర్ టికెట్స్ ..

RRR USA pre-sales bookings update
RRR USA pre-sales bookings update

యావత్ సినీ అభిమానులంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీ “ఆర్‌ఆర్‌ఆర్‌”. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడుతూ ఎట్టకేలకు ఈ నెల 25 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ లో బుకింగ్ ఓపెన్ అయ్యాయట.

ఆలా ఓపెన్ అయ్యాయో లేదో లక్షల్లో టికెట్స్ తెగాయట. జనవరి నెలలో రిలీజ్ అవుతున్న క్రమంలో కంటే ఇప్పుడు రెట్టింపుగా బుక్ అయ్యాయట. ఇప్పుడే ఇలా ఉంటె సినిమా రిలీజ్ టైం లో ఇంకెలా ఉంటుందో..సినిమా బాగుందని టాక్ వస్తే ఎలా ఉంటుందో..అసలు థియేటర్స్ సరిపోతాయా అని అంత మాట్లాడుకుంటున్నారట. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి సినిమా రావడం..ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం ..భారీ బడ్జెట్ తో తెరకెక్కడం..ఇలా ప్రతిదీ సినిమా చూడాలనే ఆతృతను పెంచుతున్నాయి. మరీ వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

- Advertisement -

ఎస్‌ఎస్‌ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. అలియా భట్‌, ఓలివియా మోరిస్‌ హీరోయిన్లు. స్వాతంత్ర్య పోరాట కాలంలో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు కలుసుకుంటే ఎలా ఉంటుందనే బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కింది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేశారనే ఫిక్షనల్‌ స్టోరీతో ఆర్ఆర్‌ఆర్‌ సినిమాను తెరకెక్కించారు. డివివి దానయ్య దాదాపు రూ.400 కోట్లతో సినిమాను నిర్మించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All