Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ టికెట్స్ అమ్ముతున్న రాజకీయ నేతలు

ఆర్ఆర్ఆర్ టికెట్స్ అమ్ముతున్న రాజకీయ నేతలు

RRR world wide pre release business
RRR world wide pre release business

ఆర్ఆర్ఆర్ టికెట్స్ ఉన్నాయా..? ఎక్కడ దొరుకుతున్నాయి…? ఎంతైనా సరే తీసుకుంటాం..? ఎవరి దగ్గరైన ఉంటె చెప్పండి..? ప్రస్తుతం ఇవే మాటలు అంతటా వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన నటులు ఎన్టీఆర్ , చరణ్ కలిసి నటిస్తుండడం , రాజమౌళి డైరెక్ట్ చేయడం తో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక రిలీజ్ కు మరో మూడు రోజులు మాత్రమే ఉండడం తో టికెట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. బుక్ మై షో లో వారం రోజుల పాటు టికెట్స్ అయిపోవడం తో టికెట్స్ కోసం ట్రై చేస్తున్నారు.

ఇదిలా ఉంటె ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో టికెట్ల‌ను హైదరాబాద్ కు చెందిన కొంద‌రు పొలిటిక‌ల్ లీడ‌ర్లు..ఆర్ఆర్ఆర్ టికెట్ల‌ను బ‌ల్క్‌గా కొనుగోలు చేసే ప‌నిలో ప‌డ్డార‌న్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏపీలో ఇప్ప‌టికే అధికారంలో ఉన్నవారే త‌మ‌కు టికెట్లు కావాల‌ని అఫీషియ‌ల్ లేఖ‌లు రాస్తున్న వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. సాధారణంగా రాజ‌కీయ‌వేత్త‌లు థియేట‌ర్ల ఓన‌ర్ల‌ను, ఫ్యాన్స్ అసోసియేష‌న్స్ ను టికెట్ల‌ను ఇవ్వాల‌ని రిక్వెస్ట్ చేస్తుంటారు. కానీ పొలిటీషియ‌న్లు ఈ సారి మాత్రం రూట్ మార్చి ఇలా బ‌ల్క్‌లో టికెట్లు కొన‌డ‌మేంట‌ని తెగ చ‌ర్చ న‌డుస్తోంది. టాప్ క్లాస్ పొలిటీషియ‌న్స్ త‌మ అనుచ‌రులు, క్యాడ‌ర్ లో త‌మ గుడ్‌విల్‌ను పెంచుకోవ‌డంలో భాగంగానే ఇలా ఆర్ఆర్ఆర్ టికెట్ల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All