
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడం తో చిత్ర యూనిట్ చిత్ర ప్రమోషన్ లలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తూ సినిమా విశేషాలను పంచుకుంటూ ..సినిమా ఫై ఆసక్తి నింపుతున్న రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్ చరణ్..ఈరోజు కోల్ కత్తా లోని సందడి చేసారు. కోలకతా లోని హౌరా బ్రిడ్జి వద్ద ప్రెస్ మీట్ ఏర్పటు చేసి సినిమా విశేషాలను మీడియా తో పంచుకున్నారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు తెలిపి ఆనందం నింపారు. ఇక ఆర్ఆర్ఆర్ టీమ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్య లో హౌరా బ్రిడ్జి వద్దకు చేరుకొన్నారు.
ప్రస్తుతం బుక్ మై షో లో వారం రోజుల పాటు టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. టికెట్స్ ఆలా బుక్ మై షో లో పెట్టారో లేదో కషన్లో హాట్ కేకుల్లా సేల్ అయ్యాయి. మొదటి రోజు చూడాలనుకున్న చాలామంది అభిమానులకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా అయితే హైదరాబాద్ లో వారం రోజుల పాటు ఏ థియేటర్ ఖాళీ గా లేదు. అన్ని షోస్ తాలూకా టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తుంది.