
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ హీరోస్ పాల్గొన్నారు. పచ్చదనం పెంపు అనేది తన మనసుకు దగ్గరైన కార్యక్రమం అని ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్ టీమ్ సభ్యులు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నారు. బిజీ షెడ్యూల్ లోనూ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ట్రిపుల్ ఆర్ టీమ్ ను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.
ఈ సందర్భాంగా చరణ్ మాట్లాడుతూ.. మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుందన్నారు. పచ్చదనం పెంపు మనసుకు దగ్గరైన కార్యక్రమం అన్నారు ఎన్టీఆర్. ఇక సినిమాల విషయానికి వస్తే..ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వ సినిమా చేయబోతున్నాడు. ఇక చరణ్..కొరటాల డైరెక్షన్లో చిరంజీవితో కలిసి చేసిన ఆచార్య మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్ లలో చరణ్ బిజీ బిజీ గా ఉన్నారు. అలాగే శంకర్ డైరెక్షన్లో తన 15 వ చిత్రం చేస్తున్నాడు.