
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడం తో చిత్ర యూనిట్ చిత్ర ప్రమోషన్ లలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తూ సినిమా విశేషాలను పంచుకుంటూ ..సినిమా ఫై ఆసక్తి నింపుతున్న రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్ చరణ్..ఈరోజు ఉదయం కోల్ కత్తా లో సందడి చేసారు. కోలకతా లోని హౌరా బ్రిడ్జి వద్ద ప్రెస్ మీట్ ఏర్పటు చేసి సినిమా విశేషాలను మీడియా తో పంచుకున్నారు.
మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు తెలిపి ఆనందం నింపారు. సాయంత్రం వారణాసిలో సందడి చేసారు. దీనికి సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ట్విట్టర్ లో సినిమా తాలూకా వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.