Homeటాప్ స్టోరీస్హైదరాబాద్ లో ఆర్ఆర్ఆర్ టీం కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన దిల్ రాజు

హైదరాబాద్ లో ఆర్ఆర్ఆర్ టీం కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన దిల్ రాజు

RRR-successmeet
RRR-successmeet

ఆర్ఆర్ఆర్ టీం కు నైజాం డిస్టిబ్యూటర్ దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఏర్పటు చేసిన ఈ పార్టీ కి ఆర్ఆర్ఆర్ టీం అంత హాజరయ్యారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు వారి కుటుంబ సమేతంగా హాజరవ్వడం విశేషం. ఆర్ఆర్ఆర్ అనే పదం ఇప్పుడు ఇక్కడ ..అక్కడ ..ఆ భాష..ఈ భాష అనే తేడాలు లేకుండా అంత వినిపిస్తుంది. రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా పాన్ ఇండియా గా తెరకెక్కిన ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు రాబడుతూ వెయ్యి కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతుంది. ఒక్క నైజాం ఏరియా లోనే దాదాపు 100 కోట్లను క్రాస్ చేసిందంటే ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుందో అర్ధం చేసుకుంది. నైజాం ఏరియా ను దిల్ రాజు రూ. 70 కోట్లకు దక్కించుకోగా..ప్రస్తుతం రూ. 100 కోట్లు క్రాస్ చేసినట్లు సమాచారం. నార్త్ లో కలెక్షన్లు రెట్టింపు అవ్వడం బాలీవుడ్ సినీ విశ్లేషకులను షాక్ కు గురి చేస్తుంది. గత రెండు వారాల్లో రిలీజ్ అయినా ఏ హిందీ చిత్రం కూడా ఆర్ఆర్ఆర్ ముందు నిలవలేకపోయింది. ఇప్పటికే ఇక్కడ 200 కోట్లు క్రాస్ చేసిందని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All