Homeటాప్ స్టోరీస్ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌ఫై ఆర్ఆర్ఆర్ సందడి చేయబోతుంది

ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌ఫై ఆర్ఆర్ఆర్ సందడి చేయబోతుంది

rrr release in world’s biggest screen odeon bfi imax in uk

యావత్ సినీ అభిమానులంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీ “ఆర్‌ఆర్‌ఆర్‌”. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడుతూ ఎట్టకేలకు ఈ నెల 25 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో తాజాగా అందుతోన్న సమాచారం మేరకు ఆర్ఆర్‌ఆర్‌ సినిమా ప్రీమియర్‌ షో యూకేలోని ఓడియన్ బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్‌ థియేటర్‌లో ప్రదర్శిచం కానుందని సమాచారం. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌గా ఈ థియేటర్‌కు పేరుండడం విశేషం. అంతేకాదు ఒక్క యూకేలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ ఏకంగా వెయ్యికిపైగా స్క్రీన్స్‌లో విడుదల కాబోతుంది. అంటే ఈ సినిమా కు ఎంత క్రేజ్ ఉందొ అర్ధమవుతుంది. మరి విడుదలకు ముందు ఎన్నో రికార్డ్స్ నెలకొల్పుతున్న ఈ మూవీ ..విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో అని అంత లెక్కలు వేసుకుంటున్నారు.

- Advertisement -

ఎస్‌ఎస్‌ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. అలియా భట్‌, ఓలివియా మోరిస్‌ హీరోయిన్లు. స్వాతంత్ర్య పోరాట కాలంలో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు కలుసుకుంటే ఎలా ఉంటుందనే బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కింది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేశారనే ఫిక్షనల్‌ స్టోరీతో ఆర్ఆర్‌ఆర్‌ సినిమాను తెరకెక్కించారు. డివివి దానయ్య దాదాపు రూ.400 కోట్లతో సినిమాను నిర్మించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All