
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో ఎక్కడ చూసిన ఈ మూవీ మేనియానే కనిపిస్తుంది. గత 20 రోజులుగా అంత ఆర్ఆర్ఆర్ చర్చే జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీడియా లో హైలైట్ అవుతూ వస్తుంది. ఇప్పటివరకు ఎన్నో రికార్డ్స్ నెలకొల్పిన ఆర్ఆర్ఆర్..ఒక్క విషయంలో మాత్రం భీమ్లా నాయక్ ను క్రాస్ చేయలేకపోయింది.
ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం కర్నాటకలోని చిక్ బల్లాపూర్‌లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, శివరాజ్‌కుమార్ తో పాటు వేలాదిమంది అభిమానులు వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తైన తర్వాత ఓ రికార్డు తెరపైకి వచ్చింది. ఈ ఈవెంట్‌ను లైవ్‌లో 153K మంది వీక్షించారు. ఇది టాలీవుడ్‌లో రెండో అత్యధికం మాత్రమే. దీనికంటే ముందు ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ 184K వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. ఈ రెండు ఈవెంట్లకు ఆయా సినిమా నిర్మాణ సంస్థల సింగిల్ ఛానెల్ ద్వారా వచ్చిన వ్యూసే కావడం విశేషం. అదే ఈ ఈవెంట్ మన హైదరాబాద్ లో జరిగి ఉంటె వ్యూస్ ఓ రేంజ్ లో వచ్చేవని అంటున్నారు.