Homeటాప్ స్టోరీస్రివ్యూ : ఆర్ఆర్ఆర్ - తెలుగు సినిమా సత్తా

రివ్యూ : ఆర్ఆర్ఆర్ – తెలుగు సినిమా సత్తా

నటీనటులు ; ఎన్టీఆర్ , రామ్ చరణ్, అజయ్ దేవగన్ , శ్రీయ , అలియా భట్ తదితరులు
డైరెక్టర్ : రాజమౌళి
మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి
నిర్మాతలు : దానయ్య
రిలీజ్ డేట్ : మార్చి 25, 2022
రేటింగ్ : 3.75/5

RRR movie review
RRR movie review

యావత్ సినీ లోకం గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్షన్లో సినిమా తెరకెక్కడం , ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా నటించడం తో సినిమా ఫై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా అంతకు మించి అనేలా ఉండడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోసారి రాజమౌళి తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పారు. మరి సినిమా కథ ఏంటి..? ప్లస్ , మైనస్ లు ఏంటి..? హీరోల తాలూకా నటన ఎలా ఉంది..? తదితర విషయాలు పూర్తీ రివ్యూ లో చూద్దాం.

- Advertisement -

కథ :

ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల‌లో నివ‌సించే వారి నేప‌థ్యంలో కథ మొదలవుతుంది. రామరాజు (రామ్ చరణ్), భీమ్ (ఎన్టీఆర్) ఇద్దరికీ చిన్న త‌నం నుంచీ పోరాడే త‌త్వం ఉంటుంది. రామ‌రాజుకు పోలీస్ కావాల‌న్న కోరిక. అందుకు త‌గ్గట్టుగానే పెరిగి పెద్దయ్యాక నాటి బ్రిటిష్ గ‌వ‌ర్నమెంట్ లో పోలీస్ ఇన్ స్పెక్టర్ అవుతాడు. ఇక భీమ్ త‌న జాతి గౌరవం కోసం పోరాడే వ్యక్తిగా ఉంటాడు. ఓ రోజు గోండు జాతికి చెందిన ఓ ప‌చ్చబొట్లు పొడిచే పాపను బ్రిటిష్ ఆఫీస‌ర్ భార్య త‌మ‌తో తీసుకెళ్లాలని అనుకుంటుంది. కానీ ఆ పాప కు వారితో వెళ్లడం ఇష్టం లేదు. అయినప్పటికీ ఆమె తీసుకొని వెళ్తుంది. ఇది తెలుసుకున్న భీం..ఎలాగైనా వారి నుండి పాప ను తీసుకరావాలని అనుకోని బయలుదేరుతాడు. అప్పటికే భీం ఫై కోపం తో ఉన్న బ్రిటిష్ సర్కార్..భీం ను అడ్డుకోవాలనే బాధ్యత రామరాజు కు అప్పగిస్తుంది. అలా రామ్ కు త‌న మిత్రుడే భీమ్ అన్న విష‌యం తెలుస్తుంది. అలాగే భీమ్ త‌న స్నేహితుడే బ్రిటిష్ ప్రభుత్వంలో ప‌నిచేస్తున్న ఇన్ స్పెక్టర్ రామ్ అని తెలుసుకుంటాడు. త‌న‌ను రామ్ మోసం చేశాడ‌ని భీమ్, త‌న‌ వద్ద భీమ్ ర‌హ‌స్యం దాచాడ‌ని రామ్ భావిస్తారు. ఎవ‌రికి వారు ద్రోహానికి గుర‌య్యామ‌ని భావించి, ఇద్దరూ పోట్లాడుకుంటారు. మరి వీరిద్దరూ ఎలా కలుసుకుంటారు..? బ్రిటిష్ ప్రభుత్వం ఫై ఎలా యుద్ధం చేస్తారు..? సీత – రామ్ ల ప్రేమ ఏంటి ..? తదితర విషయాలు మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* ఎన్టీఆర్ – రామ్ చరణ్ నటన

* రాజమౌళి డైరెక్షన్

* యాక్షన్ సన్నివేశాలు

* ఇంటర్వెల్ సీన్

మైనస్ :

* రన్ టైం

*రామ్ చరణ్ – అలియా భట్ లవ్ ట్రాక్

నటీనటుల తీరు :

* రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు నటించారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్లు కాకుండా ఇద్దరు సమానంగా నటించారు.

* రామ‌రాజు కోసం త‌పించే సీత పాత్రలో భూమి క‌నిపిస్తుంది. సీత పాత్ర నిడివి త‌క్కువే అయినా అలియా భ‌ట్ ప‌రిమితి మేర‌కు న‌టించింది.

* రామ‌రాజుకు స్పూర్తి కలిగించిన గురువుగా అజ‌య్ దేవ‌గ‌ణ్ త‌న‌దైన అభిన‌యం చూపించారు.

* శ్రియ పాత్ర నిడివి మ‌రీ చిన్నది. జెన్నీఫ‌ర్ గా న‌టించిన ఒలివియా మారిస్ క‌నిపించినంత సేపూ ఆక‌ట్టుకుంది. రాహుల్ రామ‌కృష్ణ భీమ్ మిత్రునిగా ఒదిగిపోయాడు. మిగతా నటి నటులు వారి వారి మేరకు మెప్పించారు.

సాంకేతిక వర్గం :

* సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు.

* ఎడిటింగ్ బాగున్నప్పటికీ..కాస్త నిడివి తక్కువ గా ఉంటె బాగుండు.

* కీరవాణి పాటలు , బ్యాక్ గ్రౌండ్ సినిమాకు ప్రాణం పోశాయి.

* దానయ్య ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గకుండా సినిమాను నిర్మించారు.

* ఇక రాజమౌళి గురించి చెప్పాల్సిన పనిలేదు. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్..థియేటర్ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకుడు ఏమన్నా సినిమానా అనుకునేలా తీయడం లో దిట్ట. తమ అభిమాన హీరో నుండి అభిమానులు ఏమి కోరుకుంటున్నారో అవన్నీ కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటాడు. అలాంటిది ఇద్దరు అగ్ర హీరోలను పెట్టి ఏ హీరోను ఎక్కువ చేయకుండా..ఏ హీరోను తక్కువ చేయకుండా చూసుకున్నాడు. ఇద్దరినీ సమానంగా చూపించి అభిమానులను మెప్పించారు.

ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అయితే రోమాలు నిక్క పొడుచుకునేల చేసాడు. ఇంటర్వెల్ , క్లైమాక్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే. కాకపోతే కథ పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ స్థాయిలో ఎఫెక్టివ్ గా లేదు. అలాగే అలియా భట్ – చరణ్ ల మధ్య లవ్ ట్రాక్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేదు. కానీ ఇవన్నీ సాటి అభిమానికి మాత్రం అనిపించవు.

ఓవరాల్ గా ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా సత్తా చాట్ సినిమా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All