
ఆర్ఆర్ఆర్ ప్రభంజనం 18 వ రోజు కాస్త తగ్గింది. విడుదల రోజు నుండి హౌస్ ఫుల్ తో తెలుగు రాష్ట్రాల్లో రాణిస్తున్న ఈ మూవీ సోమవారం కాస్త తగ్గినట్లు కలెక్షన్లు చూస్తే అర్ధమవుతుంది.
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR (రౌద్రం రణం రుధిరం). రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ జంటగా నటించారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇక అజయ్ దేవగన్, శ్రేయ, సముద్రఖని కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాలతో మార్చి 25న విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు రాబడుతూ..కేవలం రెండు వారాల్లోనే రు. 1000 కోట్ల క్లబ్ లో చేరి తెలుగు సినిమా సత్తా చాటింది.
ఇక ఈ మూవీ 18 వ రోజు కలెక్షన్స్ చూస్తే..
నైజాంలో రూ. 25 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.12 లక్షలు, ఈస్ట్‌లో రూ. 8 లక్షలు, వెస్ట్‌లో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. సోమవారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 80 లక్షల షేర్, రూ. 1.30 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. 18 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 259.13 కోట్లు షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 568.60 కోట్లు వసూలు చేసి, రూ. 115.60 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.