
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మొదటి రోజు మొదటి ఆటతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. ఇక ఈ సినిమా కథ అంత కూడా మల్లి చుట్టూనే నడుస్తుంది. మల్లిని బ్రిటిష్ వారు తీసుకు వెళ్లడం నుంచే మొదలవుతుంది. కనిపించింది కొన్ని సీన్లే అయినా కథను ముందుకు నడిపించే కీలక పాత్రలో మల్లి నటన మెప్పిస్తుంది. ఈ క్రమంలో అసలు ఆ చిన్నారి ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని నెటిజన్లు వెతుకుతున్నారు.
మల్లి పాత్ర పోషించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ట్వింకిల్ శర్మ. ఆమెది చంఢీగడ్. డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోతో ట్వింకిల్ శర్మ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు యాడ్స్ లలో కనిపించింది. ఫ్లిప్ కార్డ్ వంటి యాడ్‌లో కూడా నటించింది. యాడ్స్ లలో ఈ చిన్నారిని చూసిన రాజమౌళి..ఆమె గురించి ఆరా తీసి.ఆమెను మల్లి పాత్ర కోసం ఎంపిక చేసాడట. సినిమా మొదలైనపుడు ఆమె 8వ తరగతి చదువుతూ ఉంది కానీ ఇపుడు ఇంటర్మీడియట్‌కు వచ్చినట్లు చెబుతున్నారు. కనిపించింది తక్కువ సేపే అయినా మల్లి పాత్రలో నటించిన ట్వింకిల్ శర్మకు మంచి గుర్తింపు లభించింది. ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమా ఓపెనింగ్ లో ఆమె తెల్లదొరసానికి పచ్చబొట్టు పొడుస్తూ పాడే పాట, ‘నన్ను ఈడ ఇడిసిపోకన్నా..అమ్మ యాదికి వస్తుంది’ అంటూ కోటలోకి వచ్చిన ఎన్టీఆర్ ని ఆమె అర్ధించే డైలాగ్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.