
నందమూరి అభిమానులకు, మెగా అభిమానులకు ఈరోజు అసలైన పండగ వచ్చింది. మొన్నటి వరకు కాస్త ఇరు అభిమానుల మధ్య కాస్త వెలితి ఉండేది కానీ ఈరోజు తో ఆ వెలితి మొత్తం పోయింది. మెగా, నందమూరి అభిమానులు వేరు కాదు మీమంతా ఒక్కటే అని ఆర్ఆర్ఆర్ చూసి బయటకు వస్తూ చెపుతున్నారు. రాజమౌళి ఈ ఇద్దరి హీరోలను ఎలా హ్యాండిల్ చేస్తాడో..ఎవర్ని తక్కువ చేసిన తట్టుకోలేరు..అలాంటిది ఏంచేస్థాడో అని కాస్త భయం భయం గా థియేటర్స్ కు వెళ్లిన..బయటకు వస్తూ మాత్రం ఒకరి..భుజాల ఫై ఒకరు చేయి వేసుకొని వస్తున్నారు.
ముఖ్యంగా ఈ మూవీ లో ఎన్టీఆర్.. రామ్ చరణ్ ను బ్రిటిష్ వారి నుంచి కాపాడేందుకు వెళ్లిన సీన్ అభిమానులను ఫిదా చేసింది. అప్పటివరకు కొట్టుకున్న వీరిద్దరూ ఆ సీన్ తో రాజమౌళి కి దండం పెడుతున్నారు. అలాగే సీతారామరాజు భార్య సీత ఆలియాభట్ జూనియర్ ఎన్టీఆర్ కు అన్నం పెట్టి తన బాధ చెప్పుకున్నప్పుడు.. అన్న కోసం వెళ్లాల్సిందే సీతమ్మ కాదు. లక్ష్మణుడు అంటూ ఎన్టీఆర్ యుద్ధానికి సిద్ధం అవ్వడం ప్రేక్షకులకు ఎంతగానో గర్వంగా ఫీల్ అయ్యేలా చేసింది. ఈ రెండు సీన్లు మెగా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.