
యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న ఎదురుచూపులు తెరపడింది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిన్న గురువారం అర్ధరాత్రి నుండే షోస్ మొదలవ్వడం తో సోషల్ మీడియా లో ఆర్ఆర్ఆర్ ట్రేడ్ నడుస్తుంది. అభిమానులు , సినీ ప్రముఖులు , సామాన్య ప్రేక్షకులు ఇలా అంత కూడా సినిమాను చూసేందుకు పోటీ పడుతున్నారు.
ఓసారి సినిమా చూసిన వారు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో 10 సన్నివేశాలు ఆలా ఉన్నాయని అంటున్నారు. మరి ఆ పది సన్నివేశాలు ఏంటో చూద్దాం.
* మొదట రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ హైలెట్ గా నిలిచింది అనే చెప్పాలి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అతను చూపించిన హావభావాలు. ఆ సీన్ లో భారీ స్థాయిలో జనాలు ఉండడం ఎంతగానో గ్రాండ్ గా అనిపించింది.
* కొమరం భీమ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అంచనాలకు తగ్గకుండా ఉంటుంది. ఫారెస్ట్ లో ఎన్టీఆర్ పవర్ఫుల్ బాడీతో అలా నిలబడి ఇంట్రడక్షన్ ఇవ్వడం థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది.
* నాటు నాటు సాంగ్ ఎన్టీఆర్ , చరణ్ అదిరిపోయే స్టెప్స్ తో అదరగొట్టారు.
* రాజమౌళి మార్క్ కు తగ్గట్టుగా హై విజువల్ బాండింగ్ తో దోస్తీ సాంగ్ కూడా అద్భుతంగా ఉంది. అలాగే ఎమోషనల్ గా సాగే కొమరం భీముడు సాంగ్ కూడా గుండెను తాకే విధంగా ఉంది. ఇది కూడా సినిమాను మరోసారి చూసేలా ఉంటుంది.
* ఇంటర్వెల్ సీన్ చూస్తే గూస్ బంప్స్
* అలియా భట్ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో వచ్చే ఒక ఎమోషనల్ సీన్
* సినిమాలో ప్రతి సన్నివేశంలో కూడా ఎన్టీఆర్ రామ్ చరణ్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
* ఇద్దరి ఫ్రెండ్షిప్ కూడా మరొక లెవెల్లో ఉంది అనే చెప్పాలి.
* రాజమౌళి ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి
* ఇక క్లైమాక్స్ సన్నివేశాన్ని తీర్చిదిద్దడం మరొక మేజర్ ప్లస్ పాయింట్ ఇలా మొత్తం పది అంశాలు సినిమాను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి.